బాల్కనీలో విద్యుదుత్పత్తి.. జర్మనీలో సోలార్ పానెళ్ల విప్లవం!

అపార్ట్‌మెంట్ బాల్కనీలను చిన్న సోలార్ పవర్ ప్లాంట్లుగా మార్చిన ప్రయోగం జర్మనీలో విజయవంతమైంది . అద్దెకు ఉంటున్న వారు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఇప్పుడు 5,50,000 కంటే ఎక్కువ సిస్టమ్స్ సహాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి వాడకం విపరీతంగా పెరగడంతో అపార్ట్‌మెంట్ భవనాలు మినీ విద్యుత్ కేంద్రాలుగా మారాయి.  ఇవి ఫ్రిజ్‌లు, రౌటర్లు వంటి ప్రాథమిక విద్యుత్ అవసరాలను తీరుస్తూ ఏడాదికి సుమారు 100 యూరోల వరకు ఆదా చేస్తున్నాయి. 

బాల్కనీలో విద్యుదుత్పత్తి.. జర్మనీలో సోలార్ పానెళ్ల విప్లవం!
Germany Turned Apartment Balconies Into Tiny Solar Power Plants

Updated on: Sep 09, 2026 | 1:14 PM

జర్మనీలో దాదాపు 55% కుటుంబాలు అద్దె ఇళ్లలో అపార్ట్ మెంట్లలో నివసిస్తున్నారు. వీరిలో చాలా మందికి సాంప్రదాయ రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ కనెకన్ అందుబాటులో లేదు. అయితే,  అపార్ట్‌మెంట్ల బాల్కనీ రైలింగ్‌పైనే సోలార్ ప్యానెళ్లను అమర్చుకుంటున్నారు.

నిబంధనల సడలింపు

జర్మనీ ప్రభుత్వం చట్టాలలో మార్పులు చేసి  అమలు చేస్తున్న నిబంధనల వల్ల సోలార్ ప్లాంట్ల వాడకం భారీగా పెరిగింది.  పానెళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది  అక్కడి ప్రభుత్వం.  ఇంటి యజమానులు అభ్యంతరాలు చెప్పకుండా ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది.

అవి ఎలా పనిచేస్తాయంటే

జర్మీనలో విస్తృతంగా వాడుతున్న ‘బాల్కనీ సోలార్ ప్లాంట్లు’ కాంతిని విద్యుత్తుగా మార్చే ప్లగ్-అండ్-ప్లే విధానంతో చాలా సులభంగా పనిచేస్తాయి.  ఒకటి లేదా రెండు సోలార్ ప్యానెళ్లను అపార్ట్‌మెంట్ బాల్కనీ రైలింగ్‌కు లేదా గోడకు సూర్యకాంతి సరిగ్గా పడేలా అమర్చుతారు. ఈ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి డైరెక్ట్ కరెంట్ (DC) రూపంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అయితే సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసే డీసీ కరెంట్ నేరుగా గృహోపకరణాలకు పనిచేయదు. అందుకే దీనికి జత చేసిన ‘మైక్రోఇన్వర్టర్’ ఆ డీసీ కరెంట్‌ను మనం ఇళ్లలో వాడే సాధారణ ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) కింద మారుస్తుంది.

వాల్ అవుట్‌లెట్ ద్వారా కనెక్షన్

ఇన్వర్టర్ నుంచి వచ్చే కేబుల్‌ను బాల్కనీ దగ్గర ఉండే స్టాండర్డ్ వాల్ పవర్ సాకెట్‌లోకి (గోడలోని ప్లగ్ పాయింట్) నేరుగా ప్లగ్ చేస్తారు. ఈ విధంగా ప్లగ్ చేయడం ద్వారా సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసిన విద్యుత్ నేరుగా ఇంటి గ్రిడ్‌లోకి (సర్క్యూట్‌లోకి) ప్రవహిస్తుంది. ఆ సమయంలో ఇంట్లో రౌటర్, రిఫ్రిజిరేటర్, లాప్‌టాప్ వంటి పరికరాలు పనిచేస్తాయి. బేసిక్ విద్యుత్ అవసరాలను ఈ సోలార్ కరెంటు నేరుగా తీరుస్తుంది. దీనివల్ల మెయిన్ మీటర్ నుంచి ఖర్చయ్యే కరెంట్ వినియోగం తగ్గి విద్యుత్ బిల్లును ఆదా చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us