PM Modi: ప్రధాని మోదీ వెంటే ప్రపంచ నేతలు.. శిఖరాగ్ర సదస్సు తర్వాత మడ అడవుల్లో మొక్కలు నాటి..

సదస్సుకు హాజరైన దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియాలోని అతి పెద్ద మడ అడవులను సందర్శించారు. నాయకులు ప్రకృతిలో ఉల్లాసంగా గడిపి బుధవారం మడ మొక్కలు నాటారు.

PM Modi: ప్రధాని మోదీ వెంటే ప్రపంచ నేతలు.. శిఖరాగ్ర సదస్సు తర్వాత మడ అడవుల్లో మొక్కలు నాటి..
PM Modi plants mangroves

Updated on: Nov 16, 2022 | 10:07 PM

మడ అడవుల్లో మొక్కలు నాటి గ్రీన్ ఫారెస్ట్‌కు శ్రీకారం చుట్టారు ప్రపంచ అగ్రనేతలు. ఇండోనేషియాలోని బాలిలో ఆ దేశ ప్రభుత్వం 13వందల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులను పెంచుతోంది. ఈ అడవులను సందర్శించేందుకు జీ20 దేశాల అధినేతలు తరలి వెళ్లారు. జీ 20సదస్సు కోసం భారత్, అమెరికా సహా పలు దేశాల అధినేతలు ప్రస్తుతం ఇండోనేషియాలో వాలిపోయారు. బాలి చేరుకున్న ఆయా దేశాధినేతలు… మంగళవారం తొలి రోజు సమావేశాల్లో చాలా బీజీగా గడిపేశారు. సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర జి-20 దేశాల నేతలతో కలిసి మడ అడవులను సందర్శించి అక్కడ మొక్కలు నాటారు. బాలిలో శిఖరాగ్ర సదస్సులో ఇది రెండో రోజు. సదస్సుకు హాజరైన దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియాలోని అతి పెద్ద మడ అడవులను సందర్శించారు. నాయకులు ప్రకృతిలో ఉల్లాసంగా గడిపి బుధవారం మడ మొక్కలు నాటారు.

ప్రపంచ పరిరక్షణ ప్రయత్నాలలో మడ అడవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈరోజు “డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్”పై జరిగే జి 20 సమ్మిట్ యొక్క మూడవ వర్కింగ్ సెషన్‌కు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లతో పాటు సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతా ఆయన చుట్టూ నిలిచారు. ఒకరి తర్వాత ఒకరు ఆయనతో మాట్లాడేందుకు తెగ ప్రయత్నించారు. ఈ సందర్భంగా జీ20 దేశాల అధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు.

ప్రధాని మోదీతో ప్రపంచ నేతలు

జిన్‌పింగ్, రిషి సునక్‌లు కూడా కలుసుకున్నారు..

జీ-20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ టేబుల్‌లో ప్రధాని మోదీ మంగళవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక సందర్శన మాత్రమే. చైనాలో తన మూడో టర్మ్‌ను ప్రారంభించిన తర్వాత అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కి ఇది మొదటి విదేశీ పర్యటన. అలాగే, 24 నెలల తర్వాత ఇరువురు నేతల మధ్య ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమయంలో, ప్రధాని మోడీ బ్రిటీష్ ప్రధాని రిషి సునక్‌ను కూడా కలిశారు, ఆ తర్వాత ప్రధాని బ్రిటీష్ ప్రధాని రిషి సునక్‌ను చూడటం ఆనందంగా ఉందని, రాబోయే కాలంలో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు.

భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి లభించింది..

బాలి సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు జి-20 అధ్యక్ష పదవిని భారత్‌కు అందజేశారు. భారతదేశం 1 డిసెంబర్ 2022 నుండి G-20 అధ్యక్ష పదవిని అధికారికంగా చేపట్టనుంది. దీని తర్వాత 2023లో జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇది దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్లు, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు మరియు కరోనా వంటి మహమ్మారితో సతమతమవుతున్న తరుణంలో జి20కి అధ్యక్షత వహించే బాధ్యతను భారత్ తీసుకుంటోంది . ఇలాంటి సమయంలో ప్రపంచం జి20 వైపు ఆశగా చూస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం