
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఒక సరికొత్త ట్రావెల్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త స్కీమ్ కింద థాయ్‌ల్యాండ్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీగా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే థాయ్‌లాండ్‌లోకి వెళ్లే చాలా మంది ఫుకెట్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తూ ఉంటారు. మిగతా ప్రదేశాలను అంతలా పట్టించుకోరు. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. అక్కడికి వచ్చే ప్రయాణికులు దేశంలోని మిగతా పర్యాటక ప్రదేశాలను కూడా చూసేలా తమ దేశంలో విమాన ప్రయాణం ఉచితం చేయాలని చూస్తోంది.
ఇందులో భాగంగానే బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ పేరుతో కొత్త ఆ ఆఫర్‌ను తీసుకురానుంది. ఈ ఆఫర్ కింద దేశీయ విమానాల్లో ప్రయాణించే పర్యాటకులకు వన్‌వే టికెట్ ధర 1,750 బాత్, రౌండ్ ట్రిప్స్ అయితే 3,500 బాత్‌ను ప్రభుత్వమే అందించాలని చూస్తుంది.ఈ ఆఫర్ ఈ నెల నుంచి డిసెంబర్ మధ్యలో ఉండవచ్చని తెలుస్తోంది.
థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు స్టాండర్డ్ అంతర్జాతీయ టికెట్స్ కొనుగోలు చేసిన ప్రయాణికులు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్స్, ఫ్లైత్రూ సర్వీసెస్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్స్ వద్ద ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఈ ఆఫర్ కింద ప్రతి ప్రయాణికుడు రెండు దేశీయ టికెట్లను పొందవచ్చు. వారితో పాటు 20 కేజీల వరకు లగేజ్‌ను తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా రెండు లక్షలమంది అంతర్జాతీయ పర్యాటకులను థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చేలా చేయాలని థాయ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.