COVID-19 Breathalyzer: కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ కోసం శ్వాస పరీక్షలకు ఎఫ్‌డీఏ ఆమోదం.. మూడు నిమిషాల్లోనే ఫలితాలు!

|

Apr 15, 2022 | 9:26 AM

COVID-19 Breathalyzer: కరోనా మహహ్మారితో అతలాకుతలమైన ప్రజలు.. కోవిడ్‌ను గుర్తించేందుకు పరీక్షలు సులభతరం అవుతున్నాయి...

COVID-19 Breathalyzer: కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ కోసం శ్వాస పరీక్షలకు ఎఫ్‌డీఏ ఆమోదం.. మూడు నిమిషాల్లోనే ఫలితాలు!
Follow us on

COVID-19 Breathalyzer: కరోనా మహహ్మారితో అతలాకుతలమైన ప్రజలు.. కోవిడ్‌ను గుర్తించేందుకు పరీక్షలు సులభతరం అవుతున్నాయి. వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కోవిడ్‌ (Covid) ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు తయారు చేసిన పరికరానికి అత్యవసరంగా వినియోగించేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) గుర్తింపునిచ్చింది. ఇది రోగుల శ్వాసలో కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌లను గుర్తించగల సామర్థ్యం ఉన్న మొదటగా ప్రభుత్వం ఆమోదించిన పరికరం. అయితే బ్రీత్‌నలైజర్‌ 2,409 మందిపై జరిపిన అధ్యయనంలో 91.2శాతం సానుకూల ఫలితాలు వచ్చాయి.

ఎఫ్‌డీఏ విడుదల వివరాల ప్రకారం.. కరోనా వైరస్‌.. దాని వేరియంట్‌ ఒమిక్రాన్‌ విషయంలో కూడా ఫలితాలను అంచనా వేసేందుకు కూడా ఉపయోగపడనుంది. అయితే శ్వాస పరీక్ష మూడు నిమిషాలలో ఫలితాలను అందిస్తంది ఈ పరికరం. ఇన్‌ఫెక్షన్లను గురించేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ నిపుణుల పర్యవేక్షణలో అర్హత కలిగి శిక్షణ పొందిన ఆపరేటర్ల ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుందని ఎఫ్‌డీఏ తెలిపింది.

డయాగ్నొస్టిక్‌ పరీక్షలతో వేగంగా ఫలితాలు వస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణ అని ఎఫ్‌డీఏ సెంటర్‌ ఫర్‌ డివైజెస్‌ అండ్‌ రేడియోలాజికల్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జెఫ్‌ షురెన్‌ అన్నారు. ప్రతిరోజు సుమారు 160 నమూనాలను అంచనా వేసేందుకు ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చని ఏజెన్సీ తెలిపింది. ఈ పరికరాన్ని ఆస్పత్రులు, కార్యాలయాలలో ఉపయోగించవచ్చని ఎఫ్‌డీఏ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

China: అల్లాడిపోతున్న చైనా.. ఆదుకోవాలంటూ అరుపులు, కేకలతో జనం హాహాకారాలు..!

Omicron New Variant: ఒమిక్రాన్ ఉగ్రరూపం.. వెలుగు చూసిన మరో రెండు కొత్త వేరియంట్లు..!