వరదలు, భూకంపాలతో ‘ఇండోనేషియా’ అతలాకుతలం

ఇండోనేషియా వరదలు, భూకంపాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే వరదలతో 42 మంది చనిపోగా…ఆదివారం భూకంపం స్థానికులను మరింత భయపెట్టింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఇప్పటివరకు వరదల ధాటికి మృతుల సంఖ్య 70కి చేరింది. మరో 70మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఇద్దరు చనిపోగా… మరో ఇద్దరు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడి మరో 10మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పుపూవా ప్రావిన్స్ పరిధిలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. కుండపోత వానలతో పదుల సంఖ్యలో […]

వరదలు, భూకంపాలతో ఇండోనేషియా అతలాకుతలం

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:40 PM

ఇండోనేషియా వరదలు, భూకంపాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే వరదలతో 42 మంది చనిపోగా…ఆదివారం భూకంపం స్థానికులను మరింత భయపెట్టింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఇప్పటివరకు వరదల ధాటికి మృతుల సంఖ్య 70కి చేరింది. మరో 70మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఇద్దరు చనిపోగా… మరో ఇద్దరు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడి మరో 10మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పుపూవా ప్రావిన్స్ పరిధిలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. కుండపోత వానలతో పదుల సంఖ్యలో ఇళ్ళు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. వరదల ప్రభావంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు.