ప్రపంచంలోనే అతి శీతల ప్రదేశం.. మరుగుతున్న నీరు కూడా మంచులా మారుతోంది..! వీడియో చూస్తే వణుకు..

|

Jan 06, 2024 | 2:50 PM

ఇక్కడ గత 25 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్టుగా తెలిసింది. అలాంటి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడినీరు గాలిలోకి విసిరిన వెంటనే, అది మంచుగా మారుతుంది. ఇప్పుడు ఈ ప్రదేశం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెద్ద సంఖ్యలో సందర్శనకు ఇక్కడకు క్యూ కడుతున్నారు. ఒకవైపు చలి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతుంటే.. మరోవైపు ఎక్కడెక్కడి నుంచో చలిని వెతుకుతూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి వేడినీళ్లను గాలిలోకి విసిరి మంచులా మార్చేస్తూ ఆనందిస్తున్నారు.

ప్రపంచంలోనే అతి శీతల ప్రదేశం.. మరుగుతున్న నీరు కూడా మంచులా మారుతోంది..! వీడియో చూస్తే వణుకు..
Boiling Water Freezes
Follow us on

దేశంలో చలి తీవ్రత విపరీతంగా ఉంది. గడ్డకట్టుకుపోయే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రపంచంలోనే అతి చల్లగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడ గాలిలోకి సలసల మరిగే వేడి నీటిని విసిరితే కూడా అది మంచుగా మారుతుంది. ఒకవైపు చలి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతుంటే.. మరోవైపు ఎక్కడెక్కడి నుంచో చలిని వెతుకుతూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి వేడినీళ్లను గాలిలోకి విసిరి మంచులా మార్చేస్తూ ఆనందిస్తున్నారు. ఇది యూరప్‌ కంట్రీలోనే అతి శీతల ప్రదేశం అయిన ఫిన్లాండ్‌.. ఫిన్లాండ్‌లో ఈ వారం ఉష్ణోగ్రతలో రికార్డు స్థాయిలో తగ్గుదల నమోదైంది. ఇక్కడకు చేరుకున్న ఒక పర్యాటకుడు తన అద్భుతమైన అనుభవాన్ని ఇంటర్‌ నెట్‌ ద్వారా పంచుకున్నాడు. ఆ తర్వాత ఫిన్లాండ్ చలి చర్చనీయాంశమైంది. అక్కడి మంచు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దక్షిణ ఫిన్‌లాండ్‌కు చెందిన 49 ఏళ్ల లారీ ఉంటామో, ఫిన్నిష్ లాప్‌ల్యాండ్‌లో స్నేహితులతో కలిసి ట్రిప్‌ కోసం వెళ్లాడు.. అతను శీతాకాల సెలవుల కోసం వెళ్లిన సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 32 డిగ్రీల సెల్సియస్ (-22°F)కి పడిపోయాయి. ఈ సమయంలో తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచు వర్షాన్ని ఆస్వాదించామని లారీ ఉంటామో చెప్పారు. వేడి నీటిని గాల్లోకి విసిరేయడం ద్వారా మంచుగా మారడాన్ని తాను ఎప్పిటి నుంచో చూడాలనుకుంటున్నాను. కానీ అది ఎప్పుడూ చూడలేదని..అతను చెప్పాడు. అతను ఫిన్నిష్ లాప్లాండ్ చేరుకున్నప్పుడు ఉష్ణోగ్రత −32 °C (−22 °F)కి పడిపోయింది. ఇక్కడే అతను మరిగే నీటిని గాల్లో విసిర మంచు వర్షం కురిపించే ప్రయత్నించాడు.

ఇవి కూడా చదవండి

తాను నీటిని వేడి చేసి పైకి విసిరాడు…కానీ, అంతటి వేడి నీరు తనను ఏమాత్రం కాల్చలేదని లారీ చెప్పాడు.. ఎందుకంటే నీరు తనపై పడే సమయానికి అది మంచుగా మారిపోయింది.చూసేందుకు కూడా ఆ నీరు దట్టమైన మంచు మేఘం కనిపించాయి. ఇది నిజంగా చాలా సరదాగా ఉంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన చాలా వీడియోలలో నేను ఈ ట్రిక్‌ను చూశానని, దానిని స్వయంగా చేసి చూసినందుకు తానేందో సంతోషిస్తున్నానని లారీ చెప్పారు.

శుక్రవారం ఎనోంటెకియోలో 25 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్టుగా తెలిసింది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 44.3 డిగ్రీల సెల్సియస్ (-47.74 డిగ్రీల ఫారెన్‌హీట్)కి చేరుకుంది. అలాంటి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడినీరు గాలిలోకి విసిరిన వెంటనే, అది మంచుగా మారుతుంది. ఇప్పుడు ఈ ప్రదేశం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెద్ద సంఖ్యలో సందర్శనకు ఇక్కడకు క్యూ కడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..