ఖతార్‌పై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు.. దోహాలో ఒకేసారి 10 ప్రాంతాల్లో పేలుళ్లు..!

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా మారింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై అతిపెద్ద ప్రాణాంతకమైన క్షిపణి దాడిని ప్రారంభించింది. గురువారం (మార్చి 05) ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్‌తో పాటు దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలను కూడా నాశనం చేశాయి. ఇరాన్‌ యుద్ధంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది.

ఖతార్‌పై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు.. దోహాలో ఒకేసారి 10 ప్రాంతాల్లో పేలుళ్లు..!
Industrial Area, Doha, Qatar

Updated on: Mar 05, 2026 | 5:21 PM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా మారింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై అతిపెద్ద ప్రాణాంతకమైన క్షిపణి దాడిని ప్రారంభించింది. గురువారం (మార్చి 05) ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్‌తో పాటు దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలను కూడా నాశనం చేశాయి. ఇరాన్‌ యుద్ధంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1,230 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబానాన్‌లో 77 మంది చనిపోయారు.

ఆరో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ భీకరదాడులు చేస్తున్నాయి. టెహ్రాన్‌తో పాటు ఇరాన్‌‌లోని పట్టణాలను టార్గెట్‌ చేస్తున్నాయి. ఇరాన్‌ సైతం ధీటుగా సమాధానం ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే, ఇరాన్ యుద్దం నెలల తరబడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్‌ ప్రకటించింది.

తాజాగా ఖతార్ రాజధాని దోహాను ఇరాన్‌ మళ్లీ టార్గెట్‌ చేసింది. ఆకాశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దోహా ఆకాశంలో వరుసగా భారీ పేలుళ్లు వినిపించడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను ఖతార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే, ఇరాన్‌ దాడిలో అల్‌ ఉదుద్‌ ఎయిర్‌బేస్‌ ధ్వంసమయ్యింది. దోహా ఆకాశంలోనే ఈ క్షిపణులను కూల్చివేస్తుండటంతో.. పెను శబ్దాలు వస్తూ ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అటు యూఏఈపై కూడా ఇరాన్‌ భీకర దాడులు కొనసాగించింది. అయితే ఇరాన్‌కు చెందిన ఆరు ఖండాంతర క్షిపణులను, 125 డ్రోన్లను కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us