స్పెయిన్‌ అడవుల్లో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతైన వేల ఎకరాలు

స్పెయిన్‌లో పెద్ద ఎత్తున కార్చిచ్చు చెలరేగింది. కాటలోనియాలోని టోరె‌డెల్ ఎస్పనాల్ అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు ఏకంగా హెలికాప్టర్లతో నీళ్లు చల్లుతూ ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అదుపులోకి రావడం లేదు. ఫైర్ ఇంజన్లు అక్కడికి వెల్లలేకపోవడంతో.. మంటలను ఆర్పేందుకు 15 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5500 హెక్టార్ల అటవీ సంపద […]

స్పెయిన్‌ అడవుల్లో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతైన వేల ఎకరాలు

Edited By:

Updated on: Jun 28, 2019 | 9:13 PM

స్పెయిన్‌లో పెద్ద ఎత్తున కార్చిచ్చు చెలరేగింది. కాటలోనియాలోని టోరె‌డెల్ ఎస్పనాల్ అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కొండ ప్రాంతాల్లో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు ఏకంగా హెలికాప్టర్లతో నీళ్లు చల్లుతూ ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అదుపులోకి రావడం లేదు. ఫైర్ ఇంజన్లు అక్కడికి వెల్లలేకపోవడంతో.. మంటలను ఆర్పేందుకు 15 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 5500 హెక్టార్ల అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. 350 మంది అగ్నిమాపక సిబ్బంది, 120 మంది సైనికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 వేల హెక్టార్ల అడవి కార్చిచ్చుకు కాలిపోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.