EU Meet Kissing Row: ‘ప్రపంచ నేతల సమక్షంలో మహిళా మంత్రికి ముద్దు’ తీవ్ర విమర్శల పాలైన విదేశాంగ మంత్రి

|

Nov 06, 2023 | 2:47 PM

ఇటీవల జరిగిన ఐరోపా యూనియన్‌ మీటింగ్‌ (EU Meet) జరిగింది. నవంబర్ 2వ తేదీన బెర్లిన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఈయూ దేశాల మంత్రులతోపాటు వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు అయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా గ్రూప్‌ ఫొటోకు పోజిచ్చారు. క్రొయేషియా ఫారెన్‌ మినిస్టర్‌ గోర్డన్‌ గార్లిక్‌ ర్యాడ్‌మన్‌, జర్మన్‌ ఫారెన్‌ మినిస్టర్‌ అన్నాలెనా బెర్‌బాక్‌ కూడా పాల్గొన్నారు. అయితే గ్రూప్‌ ఫొటో దిగే సమయంలో క్రొయేషియా మంత్రి గోర్డాన్ రడ్మాన్‌, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా..

EU Meet Kissing Row: ప్రపంచ నేతల సమక్షంలో మహిళా మంత్రికి ముద్దు తీవ్ర విమర్శల పాలైన విదేశాంగ మంత్రి
EU Meet Kissing Row
Follow us on

బ్రసెల్స్‌, నవంబర్‌ 6: ప్రపంచ నేతలు పాల్గొన్న సమ్మిట్‌లో క్రొయేషియా మంత్రి మరో మహిళా మంత్రితో అనుచితంగా ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ముద్దు ఇచ్చి ఆమెకు ఆహ్వానం పలకడం దుమారం లేపింది. మహిళా మంత్రితో అతను ప్రతర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తడంతో చివరకు ఆయన క్షమాపణలు చెప్పాల్సివచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఇటీవల జరిగిన ఐరోపా యూనియన్‌ మీటింగ్‌ (EU Meet) జరిగింది. నవంబర్ 2వ తేదీన బెర్లిన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఈయూ దేశాల మంత్రులతోపాటు వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు అయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా గ్రూప్‌ ఫొటోకు పోజిచ్చారు. క్రొయేషియా ఫారెన్‌ మినిస్టర్‌ గోర్డన్‌ గార్లిక్‌ ర్యాడ్‌మన్‌, జర్మన్‌ ఫారెన్‌ మినిస్టర్‌ అన్నాలెనా బెర్‌బాక్‌ కూడా పాల్గొన్నారు. అయితే గ్రూప్‌ ఫొటో దిగే సమయంలో క్రొయేషియా మంత్రి గోర్డాన్ రడ్మాన్‌, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆమె వైపు వంగి, చెంపపై ముద్దు పెట్టారు. అదే సమయంలో ఆమె తన చెంప అందించడానికి తలను తిప్పి.. ఆ తర్వాత చిన్నగా నవ్వుకుంది. ఈ హఠత్‌ పరిణామానికి అక్కడనున్న నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో సర్వత్రా గోర్డాన్‌పై విమర్శలు వెళ్లువెత్తాయి. దీంతో ఆయన మీడియా సమక్షంలో క్షమాపణలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

‘ఇదొక ఇబ్బందికరమైన క్షణం. మంత్రులుగా మేం ఎప్పుడూ ఒకరినొకరం ఆత్మీయంగా పలకరించుకుంటాం. ఆ పలకరింపు ఎవరికైనా తప్పుగా కనిపిస్తే అలాంటివారి కోసం నేను క్షమాపణలు చెప్తున్నాను. సమావేశం జరిగిన రోజు విమానం ఆలస్యం కావడంతో మేమిద్దరం గ్రూప్‌ ఫొటో వద్ద కలుసుకున్నాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్లం. ఆ సందర్భాన్ని ఎవరు ఎలా తీసుకున్నారనేది నాకు తెలియదు. కొందరికి అది ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చు’ అని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు శనివారం (నవంబర్ 4) ఓ మీడియా సమావేశంలో జర్మనీ విదేశాంగ మంత్రి బేర్‌బాక్‌ను ప్రశ్నించగా.. ఆమె ఈ ఘటనపై స్పందించడానికి నిరాకరించారు. బాకులో అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రి జైహున్ బేరమోవ్‌తో జరిగిన సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘మేము ఈ రోజు ముద్దు గురించి మాట్లాడేందుకు ఇక్కడికి రాలేదన్నారు’.

మహిళలను బలవంతంగా ముద్దుపెట్టుకోవడాన్ని హింస అని కూడా అంటారని క్రొయేషియా మాజీ ప్రధాని జడ్రంకా కోసోర్ మిస్టర్ రాడ్‌మాన్‌ను గతంలో ఎక్స్‌లో (ట్విట్టర్‌) ఓ పోస్టులో తెలిపారు. కాగా ప్రపంచ కప్ విజేత జెన్నీ హెర్మోసో పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న స్పానిష్ మాజీ ఫుట్‌బాల్ చీఫ్ లూయిస్ రూబియల్స్‌పై మూడేళ్ల నిషేధం విధించినట్లు ఫిఫా గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రూబియాల్స్‌పై మూడు సంవత్సరాల పాటు అన్ని ఫుట్‌బాల్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తున్నట్లు ఫిఫా తెలిపింది. ఏకాభిప్రాయంతోనే ముద్దుపెట్టినట్లు వాదించిన రూబియాల్స్ గత సెప్టెంబర్‌లో స్పానిష్ ఫుట్‌బాల్ సమాఖ్య అధిపతి పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.