అమెరికా ఎన్నికల ఫలితాలపై టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఖుషీగా ఉంటే.. ఆయన కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. తనకు అమెరికాలో భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. తాను కొన్నాళ్లుగా భయపడుతున్నది.. తాజాగా ఎన్నికలతో నిజమైందన్నారు జెన్నా విల్సన్. దాంతో.. అమెరికాలో ఉంటే తనకు ఎలాంటి ఫ్యూచర్ ఉండేలా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. ట్రంప్ నాలుగేళ్ల పదవీకాలంలో లింగమార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమల్లోకి రాకపోయినా.. వాటిని కావాలని ఓటేసినవారు అంత తొందరగా మారరుగా అంటూ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు జెన్నా విల్సన్. అయితే.. కూతురు.. అమెరికాను వీడుతుందన్న ప్రచారంపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తన కుమారుడిని ఓక్ మైండ్‌సెట్ చంపేసిందంటూ మరోసారి పునరుద్ఘాటించారు. మస్క్ కామెంట్‌పై జెన్నా కూడా వెంటనే స్పందించారు. తండ్రి ట్వీట్ స్క్రీన్ షాట్‌ను తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంకా తన బిడ్డకు ఏదో సోకిందని.. తనను బిడ్డ ద్వేషించడానికి అదే కారణం అంటూ మళ్లీ పాత కథలు చెప్పొద్దని.. ఏ రకంగా చూసినా తానే బాధితురాలినంటూ ఎలాన్ మస్క్‌కు కౌంటర్‌గా మరో పోస్టు పెట్టింది జెన్నా విల్సన్.
The woke mind virus killed my son
— Elon Musk (@elonmusk) November 7, 2024
లింగ మార్పిడి తర్వాత తండ్రికి దూరంగా జెన్నా విల్సన్
వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తొలి భార్యకు జన్మించిన సంతానంలో జస్టిన్ విల్సన్ కూడా ఒకరు. 2022లో లింగమార్పిడి చేయించుకొని తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా మార్చుకొంది. అయితే.. మస్క్‌కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో.. ఆమె తన తండ్రికి దూరంగా ఉంటోంది. నాటి నుంచి ఇరువురి మధ్య వివాదం నడుస్తుండగా.. మాటలు కూడా లేకుండా పోయాయి. అంతేకాదు.. విల్సన్ ఆలోచనా విధానంగా కూడా డిఫరెంట్.. ఎలా అంటే.. వేల కోట్ల అధిపతి కూతురైన ఆమె.. రిచ్ పీపుల్ అంటే అసహ్యించుకోవడమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే.. తన కూతురి మైండ్‌సెట్‌ను కొందరు పాడు చేస్తున్నారంటూ ఎలాన్ మస్క్ గతంలో ఆరోపించారు. ఆయా పరిస్థితులపై తన జీవిత చరిత్ర పుస్తకంలో కొన్ని మాటలు కూడా రాశారు ఎలాన్ మస్క్. జెన్నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువ.. డబ్బులున్న వాళ్లందరూ చెడ్డవాళ్లు అని భావిస్తుందని.. ఆమె అలా మారడానికి తను చదువుకున్న స్కూలే కారణమన్నారు ఎలాన్ మస్క్. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యానన్నారు. జెన్నాతో విభేదాలు రావడం చాలా బాధాకరమని.. నా మొదటి కుమార్తె మరణం కంటే జెన్నాతో విభేదాలే ఎక్కువ బాధించాయని తన జీవిత చరిత్ర పుస్తకంలో స్పష్టం చేశారు ఎలాన్ మస్క్. మొత్తంగా.. ఎలాన్ మస్క్ ఎన్ని విజయాలు సాధించినా ఆయన్ని రెండు విషయాలు ఎప్పుడూ బాధపెడుతూనే ఉన్నాయి. మొదటిది ఆయన మొదటి కూతురు నెవడా మరణం.. రెండోది ఆయన మరో కూతురు జెన్నాతో విభేదాలు. ఏదేమైనా.. లింగ మార్పిడి చేయించుకోవడం నచ్చని బిలీనియర్ ఎలాన్ మస్క్‌కు.. కూతురు వివియన్ జెన్నా విల్సన్.. ద్వేషిగా మారిపోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..