విమాన ప్రయాణం కంటే రెస్టారెంట్లలో తినడమే ప్రమాదం

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్న భ్రమలో ప్రజలున్నట్టుగా అనిపిస్తోంది.. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం.. భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం.. అందుకే ఒక్కసారి మళ్లీ కరోనా విజృంభించింది..

  • Balu
  • Publish Date - 11:46 am, Sat, 31 October 20
విమాన ప్రయాణం కంటే రెస్టారెంట్లలో తినడమే ప్రమాదం

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్న భ్రమలో ప్రజలున్నట్టుగా అనిపిస్తోంది.. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం.. భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం.. అందుకే ఒక్కసారి మళ్లీ కరోనా విజృంభించింది.. ఆ భూతాన్ని సీసాలో బంధించి చేతులు దులుపుకుందామంటే కావడం లేదు.. ఇక హార్వర్డ్‌ పరిశోధకులు చెప్పిన మాట వింటే మరింత గుబులు పుడుతోంది.. తెరిచేశారు కదా అని రెస్టారెంట్లకు వెళ్లేసి తినకండి.. అలాగే కిరాణా సామాన్ల కోసం అదే పనిగా షాపులకు వెళ్లకండి.. ఎందుకంటే వీరికే కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు హార్వర్డ్‌ పరిశోధకులు. విమానంలో ప్రయాణాలు చేసే వారికంటే వీరికే కరోనా వైరస్‌ ఎక్కువగా సోకుతుందని చెబుతున్నారు.. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి.. మిగిలింది మన చేతుల్లోనే ఉందంటున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. విమాన ప్రయాణికులకు కూడా తగు జాగ్రత్తలు చెప్పారు.. విమానం, ఎయిర్‌పోర్ట్‌లలో వెంటిలేషన్‌ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలంటున్నారు.. విమానాలను తరచుగా శానిటైజ్‌ చేయాలని సూచిస్తున్నారు. కరోనాను నియంత్రించే విషయంలో విద్య, అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తాయని హార్వర్డ్‌ పరిశోధకులు చెబుతున్నారు.