అంచనాల కన్నా పెరుగిపోతున్నా భూగోళ ఉష్ణ్రోగ్రతలు.. కీలక ప్రకటనలు చేసిన ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ..

|

Dec 16, 2020 | 9:01 PM

భూగోళ ఉష్ణోగ్రతలు వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల కన్నా 0.3 ఫారిన్ హీట్ డిగ్రీ ఎక్కువగా వేడెక్కుతోంది. గతంలో హాడ్ క్రుట్ చేసిన అంచనాలను ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీకి చెందిన

అంచనాల కన్నా పెరుగిపోతున్నా భూగోళ ఉష్ణ్రోగ్రతలు.. కీలక ప్రకటనలు చేసిన ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ..
Follow us on

భూగోళ ఉష్ణోగ్రతలు వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల కన్నా 0.3 ఫారిన్ హీట్ డిగ్రీ ఎక్కువగా వేడెక్కుతోంది. గతంలో హాడ్ క్రుట్ చేసిన అంచనాలను ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీకి చెందిన వాతావరణ విభాగం మార్చింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూ వాతావరణ అంచనాల సంస్థ ‘హాడ్‌క్రుట్‌’. 1850లో ఉన్న భూగోళ ఉష్ణోగ్రతల కన్నా 2010 నుంచి 18 వరకు భూమీ మీద ఉష్ణోగ్రత 1.90 ఫారిన్‌హీట్‌ డిగ్రీలు పెరగుతుందని హాడ్‌క్రుట్‌ అంచనా వేసింది. నిజానికి భూతాపం 1.93 ఫారిన్‌హీట్‌ పెరిగింది. గత 170 సంవత్సరాలుగా భూమి ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం మనుషుల వల్ల వాతావరణంలో కలుస్తున్న కర్బనాల వల్లె అని పరిశోధకులు తెలిపారు.

అటు అమెరికాకు చెందిన నాసా, నేషనల్‌ ఓసియానిక్‌ అండ్‌ అట్మాస్పిరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అంచనాలకన్నా భూమి మీద పెరగడం తక్కువగా ఉంది. ఈసారి కూడా హాడ్ క్రూడ్ అంచనాల్లో 0.3 ఫారిన్‌హీట్‌ డిగ్రీల తేడా వచ్చింది. 1986లో మొదటి సారి తమ విభాగం భూతాపోన్నతిని అంచనా వేసిందని, ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్శిటీలోని క్లైమెట్‌ రిసర్చ్‌ యునిట్‌ డైరెక్టర్‌ టిమ్‌ ఆస్‌బోర్న్‌ తెలిపారు.