World Fastest and Costly Ambulance: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు, కార్లు అనే వార్తలు వింటాం. కానీ, లెటెస్ట్‌గా ఈ ఖరీదైన జాబితాలో చేరింది ఓ అంబులెన్స్. మీరు వింటున్నది నిజమే.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.. అంబులెన్స్‌లు మామూలుగానే చాలా స్పీడ్‌గా వెళ్తాయి. అందులో వైద్యపరంగా కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే, ఆ అంబులెన్స్‌ల ధర చెప్పుకునేంత ఎక్కువగా ఉండదు. కానీ, దుబాయ్ రోడ్లలో ఇకపై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లైకాన్ హైపర్ స్పోర్ట్స్ అంబులెన్స్‌లు దూసుకెళ్లనున్నాయి. ఇటీవల దుబాయ్ (Dubai) కార్పొరేషన్ ఆఫ్ అంబులెన్స్ సర్వీసెస్ ఇటీవల దుబాయ్ ఎక్స్‌పోలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్, ఖరీదైన అంబులెన్స్‌ను ప్రదర్శించింది. ఈ అంబులెన్స్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
దుబాయ్‌కి చెందిన డబ్ల్యూ మోటార్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఏడవ లైకాన్ హైపర్ స్పోర్ట్స్ కారును తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లైకాన్ హైపర్‌స్పోర్ట్ కారు 6 యూనిట్లు మాత్రమే ఉండగా, డబ్ల్యూ మోటార్స్ 7వ కారును తయారు చేసింది. ఇక దీని ధర అక్షరాల 26 కోట్ల రూపాయలు అని చెబుతోంది సంస్థ. ఈ కారును 440 వజ్రాల సెట్తో డిజైన్ చేసింది డబ్ల్యూ మోటార్స్. ధరకు తగ్గట్టే, ఈ కారు అంబులెన్స్‌లో సౌకర్యాలు ఉంటాయి. కారు లోపలి టాప్ భాగం బంగారు పూతతో డిజైన్ చేశారు. లైకాన్ హైపర్‌స్పోర్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ హోలోగ్రాఫిక్, హోలోగ్రాఫిక్ మిడ్-ఎయిర్ డిస్‌ప్లేతో వస్తుంది.
అయితే, కారు మొత్తం బరువును తగ్గించడానికి పూర్తిగా కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించింది డబ్ల్యూ కంపెనీ. డ్రైవర్ ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా ఆ ఖరీదైన అంబులెన్స్ పనిచేస్తుంది. ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి ప్రముఖ ఆస్పత్రులు. డబ్ల్యూ మోటార్స్ కంపెనీని 2012లో స్థాపించారు. ఈ కంపెనీ తమ తొలి కాన్సెప్ట్‌ను 2013 దుబాయ్ మోటార్ షోలో ఆవిష్కరించింది.
Also Read: