అత్యవసరంగా పాకిస్తాన్‌లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. అత్యవసర చికిత్స అందిస్తుండగా ఒకరు మృతి..

|

Mar 13, 2023 | 12:43 PM

ఢిల్లీ నుంచి దోహాకు బయల్దేరిన విమానాన్ని పాకిస్థాన్​లో అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడికి అస్వస్థత తలెత్తడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు.

అత్యవసరంగా పాకిస్తాన్‌లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. అత్యవసర చికిత్స అందిస్తుండగా ఒకరు మృతి..
Indigo
Follow us on

పాకిస్తాన్‌లో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఇండిగో విమానాన్ని పాకిస్థాన్​లో మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఢిల్లీ నుంచి దోహాకు వెళ్లే విమానాన్ని పాకిస్తాన్​లోని కరాచీలో దించేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ఈ-1736 ఇండిగో విమానం బయల్దేరింది. ఇది దోహాకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ ప్రయాణికుడికి ఆరోగ్య పరమైన సమస్య తలెత్తాయి. పరిస్థితి విషమించడం వల్ల విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని పాకిస్థాన్​లోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. దురదృష్టవశాత్తూ విమానం గగనతలంలో ఉండగానే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. కరాచీ ఎయిర్​పోర్ట్ వైద్య సిబ్బంది ఈ మేరకు ధ్రువీకరించారు.

సోమవారం ఉదయం 8:41 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 11 గంటలకు ఖతార్​ చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే అబ్దుల్లా అనే 60 ఏళ్ల నైజీరియన్ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూస్ రావడంతో వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. మెడికల్​ ఎమర్జెన్సీ కారణంగా కరాచీ ఎయిర్​పోర్ట్​లో అత్యవసర ల్యాండింగ్​కు అనుమతి కోరారు. అయితే విమానం​ కరాచీలో ల్యాండ్​ అయ్యేలోపే ఆ ప్రయాణికుడు మరణించాడు.

దురదృష్టవశాత్తూ ప్రయాణికుడిని రక్షించలేకపోయామని విమానయాన సంస్థ తరపున చెప్పబడింది. ఎయిర్‌పోర్టులోని వైద్య బృందం ప్రయాణికుడు చనిపోయినట్లు ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం