Currency Notes Rain : ఆ దేశంలో గంటపాటు కురిసిన డబ్బుల వర్షం… ఏరుకోవడానికి ఎగబడిన జనం .. వీడియో వైరల్

వడగళ్ల వర్షం, చేపల వర్షం.. వంటివి అనేకం విన్నాం.. చూస్తున్నాం.. అయితే మన దాయాది దేశంలో నోట్ల కట్టల వర్షం కురిసింది. అవును పేద దేశం పాకిస్తాన్ లో విచిత్రంగా డబ్బుల వర్షం కురవడం..

Currency Notes Rain : ఆ దేశంలో గంటపాటు కురిసిన డబ్బుల వర్షం... ఏరుకోవడానికి ఎగబడిన జనం  .. వీడియో వైరల్
Notes Rain In Pakisthan

Updated on: Mar 18, 2021 | 11:53 AM

Currency Notes Rain :  వడగళ్ల వర్షం, చేపల వర్షం.. వంటివి అనేకం విన్నాం.. చూస్తున్నాం.. అయితే మన దాయాది దేశంలో నోట్ల కట్టల వర్షం కురిసింది. అవును పేద దేశం పాకిస్తాన్ లో విచిత్రంగా డబ్బుల వర్షం కురవడం అందరికీ షాక్ ఇచ్చింది.

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నరోవాల్‌లో ఇటీవల ఓ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి చాలా మంది బంధువులు కూడా హజారయ్యారు. అయితే వధువువరులు ఇద్దరూ ఇంటి కింద నిల్చుని ఉన్నారు.. నవ్రా దేవా కుటుంబ సభ్యులు డాబా ఎక్కారు. అంతలో డాబా మీద నుంచి లక్షల నోట్లను గాల్లోకి విసిరారు. దీంతో ఈ నవ దంపతులపై నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది. అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుపై పెద్దలు అక్షితలు జల్లినట్లుగా కరెన్సీని చల్లారు.. అవి గాలిలో ఎగురుతూ కిందపడ్డాయి. అవి అలా కింద పడుతుంటే.. పైసా అంటూ ప్రజలు వాటిని పట్టుకున్నారు. అక్కడ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఘటన పాకిస్థాన్ లో నోట్ల వర్షం అంటూ వైరల్ అయ్యింది. నెట్టింట్లో వీడియో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ నోట్ల వర్షం ఎంత అంటే దాదాపు రెండు లక్షల రూపాయాలు అని తెలిసింది..

అసలే ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ లో ఈ రేంజ్ లో పెళ్లిళ్లు స్టేజ్ లో ప్రజలు ఉన్నారా అనే చర్చ ప్రారంభమైంది. అయితే పెళ్లి కొడుకు సోదరుడు అమెరికాలో ఉంటున్నాడు.. పెళ్లికోసమే పాకిస్థాన్ వచ్చినట్లు తెలిసింది. తమ ఇంట్లో పెళ్ళికి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకనే ఆ డబ్బుని ఇలా వర్షంలా వేశాడట.. ఆ డబ్బుని తీసుకున్న పేదవారు ఎంతో సంతోష పడ్డారు. ఇలాంటి పెళ్లిని సందర్భాన్ని ఇప్పటి వరకూ చూడలేదని వారంటున్నారు.

Also Read: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న హరీష్ రావు

ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ? వేసవిలో ఎగ్స్ తినడం వల్ల సమస్యలు ఉంటాయా..