Cristiano Ronaldo : క్రిస్టియానో రోనాల్డో సోషల్‌ మీడియా రికార్డు… అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా ఘనత…

పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డో సోషల్‌ మీడియాలో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో...

Cristiano Ronaldo : క్రిస్టియానో రోనాల్డో సోషల్‌ మీడియా రికార్డు... అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా ఘనత...

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 4:26 PM

పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డో సోషల్‌ మీడియాలో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన తొలి వ్యక్తిగా 35 ఏండ్ల సాకర్ సూపర్‌స్టార్‌ రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 250 మిలియన్లకు పైనే కావడం విశేషం. హాలీవుడ్‌ సింగర్‌ అరియానా గ్రాండే 213 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇన్​స్టా అఫీషియల్‌ అకౌంట్‌కు(382 మిలియన్లు ఫాలోవర్లు) మాత్రమే రొనాల్డో కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. 2020లో రొనాల్డో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌కు అత్యధికంగా 19.7 మిలియన్ల లైకులు వచ్చాయి. ఈ రికార్డు కూడా తనపేరిటే ఉన్నది. సాకర్ లెజెండ్ డీగో మారడోనా మృతికి సంతాపం తెలుపుతూ రొనాల్డో చేసిన పోస్టుకు గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్‌లు వచ్చాయి.

రోనాల్డో ఇన్‌స్టా…

 

Also Read:  

Indian Badminton Team: బ్యాంకాక్ బయలుదేరిన భారత బ్యాడ్మింటన్ బృందం… జనవరి 12 నుంచి 17 వరకు టోర్నీ….

India Vs Australia 2020: అభిమానులకు గుడ్ న్యూస్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా నెగిటీవ్.. ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..