షాకింగ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తో ఆ ముప్పు.. జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులు

|

Mar 08, 2022 | 1:28 PM

ఊహించని ఉపద్రవంలా విరుచుకుపడ్డ కరోనా(Corona) మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. వైరస్ బారి నుంచి బయటపడేందుకు ఇప్పటికీ ఎంతో శ్రమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి బారి నుంచి కాపాడేందుకు...

షాకింగ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తో ఆ ముప్పు.. జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులు
Follow us on

ఊహించని ఉపద్రవంలా విరుచుకుపడ్డ కరోనా(Corona) మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. వైరస్ బారి నుంచి బయటపడేందుకు ఇప్పటికీ ఎంతో శ్రమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి బారి నుంచి కాపాడేందుకు కొవిడ్ వ్యాక్సిన్లు(Vaccine) అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టీకాలపై రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల పాటే సమర్థవంతంగా పనిచేస్తాయని, బూస్టర్ డోస్(Booster Dose) అవసరమని, కొన్ని రకాల వ్యాక్సిన్లు వేసుకున్నా వ్యర్థమని… ఇలా ఎన్నో ప్రశ్నలు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలో తయారైన స్థానిక కరోనా వ్యాక్సిన్లతో కొంతమంది లుకేమియా బారిన పడ్డారని, భవిష్యత్తులో ఆ వ్యాక్సిన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతాయని వార్తలు వెలువడ్డాయి. చైనాలోని స్థానిక హెల్త్ కమిషన్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాక లుకేమియా బారిన పడిన వారిపై పరిశోధనలు కూడా చేస్తున్నట్టు ఆ నివేదిక తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైనాలోని 18 ప్రావిన్సులలో ఈ నివేదిక కాపీలను పంచి పెట్టమని ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ప్రచారంలో జరుగుతోంది. హెబెయ్, లియోనింగ్, సిచువాన్, షాంక్సీ ఇలా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ నివేదిక చక్కర్లు కొడుతోంది. చైనా ఆరోగ్య సంస్థ తమ హెల్త్ అధికారులను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించింది.

Also Read

G‏irl Friends: అబ్బాయిలూ మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా.. అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే

Singareni Mines: సింగరేణి గని ప్రమాదంలో లభ్యం కానీ ఆచూకీ.. ఆవేదనలో బాధిత కుటుంబాలు

Post Office Schemes: పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఈనెల 31 లాస్ట్ డేట్..