
కెనడాకు చెందిన రాబర్ట్ షెలెన్ బెర్గ్ అనే స్మగ్లర్ కు కింది కోర్టు విధించిన మరణ శిక్షను చైనా లోని మరో కోర్టు సబబేనని ధృవీకరించింది. 2014 నుంచి షెలెన్ బెర్గ్ చైనాలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ ఏడాది 225 కేజీల నిషిద్ధ డ్రగ్స్ ను ఆస్ట్రేలియాకు స్మగుల్ చేస్తూ ఇతడు పట్టుబడ్డాడు. 2018 లో ఇతనికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. అయితే తానూ నిర్దోషినని, తనను విడుదల చేయాలని కోరుతూ ఆయన అప్పీలు దాఖలు చేశాడు. తన కేసుపై తిరిగి విచారణ జరిపించాలని కోరాడు. కానీ ఇతని నేరానికి మరణ శిక్ష తగినదని డాలియన్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాబర్ట్ షెన్ యాంగ్ లోని మరో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ దీన్ని ఈ కోర్టు కూడా కొట్టివేస్తూ.. తొలుత డాలియన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని పేర్కొంది. అయితే ఇదంతా హోస్టేజీ డిప్లొమసీ అని కెనడా అధికారులు ఆరోపిస్తున్నారు. చైనాలోని హుబె ప్రావిన్స్ కి చెందిన మెంజో వాంజూ అనే వ్యక్తిని తాము అరెస్టు చేసినందుకు ప్రతీకారంగా చైనా తమ దేశస్థుడిపై ఈ చర్య తీసుకుందని ఆరోపించింది.
ఇరాన్ లో తన బిజినెస్ లావాదేవీలకు సంబంధించి ఫ్రాడ్ కు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో యూఎస్ వారంట్ పై2018 లో ఈమెను వాంకోవర్ విమానాశ్రయంలో కెనడా పోలీసులు అరెస్టు చేశారు. అందుకు ప్రతీకారంగా మా దేశస్థుడిని అరెస్టు చేసి మరణ శిక్ష విధిస్తారా అని కెనడా మండిపడుతోంది. కాగా రాబర్ట్ కి ఉరి శిక్ష విధించడాన్ని కెనడా రాయబారి ఖండించారు. ఇప్పటికే అతడు జైలు శిక్ష అనుభవించాడని, ఇక అతనికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని డొమినిక్ బర్దన్ అనే ఈ రాయబారి అన్నారు. కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన..రాబర్ట్ కు విధించినది క్రూరమైన శిక్ష అన్నారు ఇది అసాధారణమైనదన్నారు. చైనా అధికారులకు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామన్నారు.
అసలు తమ దేశంలో మెంజో కేసుకు దీనికి సంబంధం లేదని ఆయన చెప్పారు. కాగా కెనడాకే చెందిన మైఖేల్ అనే వ్యక్తి గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై చైనా అధికారులు అతనిని కూడా అరెస్టు చేశారు. అతనికి కూడా కోర్టు జైలు శిక్ష విధించనుంది. ఈ పరిణామాలతో చైనా -కెనడా మధ్య సంబంధాలు డీలా పడుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : సీఎం సార్ మీ స్టెప్పులు సూపర్..వైరల్ అవుతున్న సీఎం డాన్స్ వీడియో..ఎక్కడంటే..?:CM Dance Video.