External Affairs Minister tour: భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం శ్రీలంక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాల గురించి చర్చించనున్నట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ్ రాజపక్స పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ శ్రీలంకను సందర్శించడం తొలిసారి.
ఈ పర్యటనలో శ్రీకలం అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స, రాజకీయ వేత్తలు దినేష్ గుణవర్ధనేయతో జైశంకర్ భేటీ కానున్నారు. ఈ భేటీల్లో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, జైశంకర్ 2021లో శ్రీలంకను సందర్శించిన మొట్టమొదటి విదేశీ ప్రముఖుడయ్యాడు. మంత్రి జైశంకర్ పర్యటన 5వ తేదీ నుంచి 7 వరకు కొనసాగనుంది.
అయితే శ్రీలంక, భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సహాకార ఒప్పందంపై 2019లో సంతకాలు చేసినప్పటికీ ఈ ఒప్పందం మధ్య వివాదస్పదంగానే ఉంది. దీనిపై చర్చించే అవకాశం ఉంది.
నిమ్స్‌కు వచ్చిన ప్రతి రోగికి చికిత్స .. మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మంత్రి ఈటల
డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న తారల అరెస్ట్ పర్వం..ముంబైలో పట్టుబడిన కన్నడ నటి శ్వేతా కుమారి