హాంకాంగ్ లో నిరసనకారులపై ‘ కారు పేలుళ్లు ‘

|

Jul 31, 2019 | 4:59 PM

హాంకాంగ్ లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఓ వినూత్న పంథా చేపట్టారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో అరెస్టు చేసిన తమ సహచరులను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగిన వీరిని చెదరగొట్టడానికి వారు.. తమ కారు వెనుకభాగంలో భారీ శబ్దంతో కూడిన టపాకాయలను (ఫైర్ వర్క్స్) పేలుస్తూ వేగంగా వాహనం నడిపారు. ఈ పేలుళ్లకు భయపడి అనేకమంది తలోదిక్కుకూ పరుగులు తీయగా.. సుమారు 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 28 న […]

హాంకాంగ్ లో నిరసనకారులపై  కారు పేలుళ్లు
Follow us on

హాంకాంగ్ లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఓ వినూత్న పంథా చేపట్టారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో అరెస్టు చేసిన తమ సహచరులను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగిన వీరిని చెదరగొట్టడానికి వారు.. తమ కారు వెనుకభాగంలో భారీ శబ్దంతో కూడిన టపాకాయలను (ఫైర్ వర్క్స్) పేలుస్తూ వేగంగా వాహనం నడిపారు. ఈ పేలుళ్లకు భయపడి అనేకమంది తలోదిక్కుకూ పరుగులు తీయగా.. సుమారు 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 28 న జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా.. పోలీసులతో వందలాది ఆందోళనకారులు తలపడ్డారు. ఆ ఘర్షణల్లో పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. కొంతమందిపై తీవ్రమైన అభియోగాలు మోపి.. జైలుకు పంపవచ్చునన్న సమాచారం అందడంతో… నిరసనకారులు మళ్ళీ రెచ్చిపోయారు. తమ వారిని అదుపులో ఉంచిన పోలీసు స్టేషన్ పై దాడికి యత్నించారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు తమ వాహనాల్లో ఇలా ఫైర్ వర్క్స్ పేలుస్తూ దూసుకుపోయారు. అసలే… నేరస్తుల అప్పగింత బిల్లుపై చైనాకు వ్యతిరేకంగా సుమారు నెలరోజులుగా హాంకాంగ్ వాసులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.