G20 summit: అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు..కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అంతర్జాతీయ మీడియాలో విమర్శలు..

|

Sep 11, 2023 | 7:02 PM

ఆయన చేసింది పూర్తిగా తప్పు.. డిన్నర్‌కు ఎందుకు హాజరు కాలేదు..? జి 20 సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్లిన ఓ దేశాధినేతపై ఆ దేశంలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ విమర్శలను ఎదుర్కొంటున్నది ఎవరు కాదు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులో నుంచి తిరిగి కెనెడా వెళ్లిన ఆయనపై అక్కడి పత్రికలు, ప్రతిపక్షాలు, సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నాయి. విమర్శలతో కడిగేస్తున్నాయి. కెనడాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిస్టర్ ట్రూడో చేసిన పనికి ఆయన సొంత దేశంలో విమర్శలు..

G20 summit: అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు..కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అంతర్జాతీయ మీడియాలో విమర్శలు..
Justin Trudeau Skips G20 Dinner
Follow us on

మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు.. వచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు.. ఆయన చేసింది పూర్తిగా తప్పు.. డిన్నర్‌కు ఎందుకు హాజరు కాలేదు..? జి 20 సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్లిన ఓ దేశాధినేతపై ఆ దేశంలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ విమర్శలను ఎదుర్కొంటున్నది ఎవరు కాదు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులో నుంచి తిరిగి కెనెడా వెళ్లిన ఆయనపై అక్కడి పత్రికలు, ప్రతిపక్షాలు, సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నాయి. విమర్శలతో కడిగేస్తున్నాయి. కెనడాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిస్టర్ ట్రూడో చేసిన పనికి ఆయన సొంత దేశంలోనేకాదు అంతర్జాతీయ మీడియాలో కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఇందుకు కారణం ఉంది.. జి 20 సమావేశాల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడే ఇందుకు కారణం. అమెరికా, బ్రిటన్, భారత్, యూఏఈ దేశాల అధినేతలతో జస్టిన్ ట్రూడో కలవలేదు. ప్రధాన వేదికపై కూడా ఆయన కనిపించలేదు. చివరికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన డిన్నర్‌లో కూడా ఆయన కనిపించలేదంటూ కెనడా మీడియా విమర్శించింది.

రెండు రోజుల సమ్మిట్‌లో ప్రపంచ నాయకులచే ‘దూరం’గా ఉన్నారని కెనడా మీడియా  హైలైట్ చేసింది. G20 సమ్మిట్‌లో నాయకుల విందులో ట్రూడో హాజరుకాలేదని.. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ప్రారంభానికి కూడా అతను దూరమయ్యాడని మండిపడ్డాయి. టొరంటో సన్ కెనడా పత్రిక ప్రధాన శీర్షికను పెద్ద అక్షరాలతో  ఫుల్ పేజీ కథనాన్ని ప్రచురించింది.

కెనడా  ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే X లో ఈ ఫోటోను పోస్ట్ చేసింది. పక్షపాతాన్ని పక్కన పెట్టి, కెనడియన్ ప్రధానమంత్రిని పదే పదే అవమానించడం, ప్రపంచంలోని మిగిలిన వారిపై తొక్కడం ఎవరూ ఇష్టపడరు,”

కెనడాలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా G20 సమ్మిట్‌లో మిస్టర్ ట్రూడోను ప్రపంచ దేశాల అధినేతల పక్కన పెట్టారని విమర్శించారు.

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడుతో కూడా టొరంటో కలవలేకపోయారని మండిపడుతున్నారు. టొరంటో పనికిరాని ప్రధాని అంటూ ఆ దేశంలోని సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తోంది.

ప్రపంచ దేశాల అధినేతలతో కలిసిపోలేకపోయారని, మిస్టర్ ఇగో అంటూ విమర్శించారు. మినహా మిగతా నాయకులందరికీ అన్ని అంతర్జాతీయ మీడియా, ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయారని తెలిపింది. గతంలో, కెనడాలో సిక్కు వేర్పాటువాద గ్రూపులు కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కెనడాలో ఉగ్ర వాదుల భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడం పట్ల మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఇరువురు నేతల మధ్య సంభాషణ తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.