
ఆగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. హంటింగ్టన్ బీచ్‌లో శనివారం మధ్యాహ్నం ఒక హెలికాప్టర్ గాల్లో గింగిరాలు కొడుతూ కుప్పకూలింది. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పసిఫిక్ కోస్ట్ హైవే సమీపంలోని హంటింగ్టన్ స్ట్రీట్‌లో జరిగిన ఈ ప్రమాదంపై హంటింగ్టన్ బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్, అగ్నిమాపక విభాగం స్పందించాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని.. హెలికాప్టర్ చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బటయకు తీశామని తెలిపారు.
ఈ ప్రమాదంలో సుమారు హెలికాప్టర్‌లో ఉన్న వారితోపాటు స్థానికంగా నివసిస్తున్న ముగ్గురు జనాలు కూడా గాయపడినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు.అయితే వారి ఆరోగ్య పరిస్థితిపపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ అందలేదు.
ఇదిలా ఉండగా బీచ్‌లో ఉన్న కొందరు యువకులు హెలికాప్టర్ కూలిపోవడాన్ని గమనించి. వెంటనే వీడియో తీశాడు. తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. హెలికాప్టర్ వెనుక రోటర్‌లో సాంకేతిక లోపం వల్ల అది పక్కకు తిరుగుతున్నట్లు మనం చూడవచ్చు. తర్వాత అది గింగిరాలు తిరుగుతూ అక్కడే ఉన్న తాటి చెట్లపై కుప్పకూలడం కనిపిస్తోంది.
Helicopter spirals out of control and crashes on a beach near homes and buildings in Los Angeles 😳 pic.twitter.com/nWfoNLv1N6
— Times Algebra (@TimesAlgebraIND) October 12, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.