Baba Vanga: పుతిన్ ప్రపంచానికి ప్రభువు అవుతాడు.. బాబా వాంగా జోస్యం ఫలిస్తుందా..?

|

Mar 29, 2022 | 6:31 AM

Baba Vanga on Vladimir Putin: రష్యా ఏమాత్రం ఆలోచించకుండా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో అంధ ఆధ్యాత్మికురాలి అంచనా వార్తల్లో నిలిచింది.

Baba Vanga: పుతిన్ ప్రపంచానికి ప్రభువు అవుతాడు.. బాబా వాంగా జోస్యం ఫలిస్తుందా..?
Baba Vanga
Follow us on

Baba Vanga on Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తంచేస్తోంది. అయినప్పటికీ.. రష్యా ఏమాత్రం ఆలోచించకుండా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో అంధ ఆధ్యాత్మికురాలి అంచనా వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముందుగానే ఊహించిన ఒక అంధ ఆధ్యాత్మికురాలు.. బాబా వాంగా.. వ్లాదమిర్ పుతిన్ ప్రపంచానికి ప్రభువు అవుతాడంటూ 43 ఏళ్ల కిందటే అంచనా వేసింది. ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టే.. బాబా వాంగా (Blind mystic Baba Vanga) మరణానికి ముందు ప్రపంచానికి సంబంధించిన సంఘర్షణ గురించి హెచ్చరించింది. 1979 లో ప్రముఖ రచయిత వాలెంటిన్ సిడోరోవ్‌తో జరిగిన సమావేశంలో బాబా వాంగా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘అన్నీ మంచులా కరిగిపోతాయి, ఒక్క దానిని మాత్రమే తాకలేరు.. అదే (వ్లాదిమిర్ పుతిన్ కీర్తి) రష్యా కీర్తి’’ని అంటూ సంబోధించింది. రష్యాను ఎవరూ ఆపలేరని.. ప్రపంచాన్ని రష్యా శాసించబోతోందని ఆమె అంచనా వేశారు. వ్లాదిమిర్ పుతిన్ కీర్తి కొండలా పెరుగుతుందని జోస్యం చెప్పారు.

ఆమె అంచనా వేసినట్టుగానే ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగింది. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్‌ కన్నా కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేశారు బల్గేరియాకు చెందిన అంధ జ్యోతిష్యురాలు బాబా వాంగా. ఆమె 26 ఏళ్ల కిందటే 1996లో తన 84వ ఏట తుదిశ్వాస విడిచారు. అయితే.. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె గతంలోనే అంచనావేశారంటున్నారు ఆమె అనుచరులు. తన చిన్నతనంలో ఓ భయంకర పెను తుఫానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించారని పేర్కొంటున్నారు.

అయితే.. బాబా వాంగ ప్రపంచ పరిణామాల గురించి ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం నిజమయ్యాయి. అమెరికాపై రెండు లోహ విహంగాల దాడులు జరుగుతాయని, వేలాది మంది అమాయక ప్రజలు చనిపోతారని (9/11 దాడులు) అంచానా వేశారు. దీంతోపాటు 2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సిరియా నుంచి ముస్లింల యుద్ధం ప్రారంభమవుతుందన్నారు.

తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్దం గురించి 43 ఏళ్ల కిందటే అంధ జ్యోతిషురాలు చెప్పడం గమనార్హం. నివేదికల ప్రకారం అంధ ఆధ్యాత్మికవేత్త అణ్వాయుధాల వినియోగం, మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా జోస్యం చెప్పారని పేర్కొంటున్నారు.

Also Read:

Mexico Shooting: మెక్సికోలో మారణహోమం.. 19 మందిని చంపిన దుండగులు..

Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్