Bitcoin: బిట్‌కాయిన్ కొత్త రికార్డు… ఒక కాయిన్ విలువ ఎన్ని డాలర్లకు సమానమో తెలుసా..?

| Edited By:

Jan 04, 2021 | 5:07 AM

బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డులు సృష్టిస్తోంది. ఒక బిట్‌కాయిన్ విలువ 30వేల డాలర్లను తాకింది. అంటే మన కరెన్సీలో...

Bitcoin: బిట్‌కాయిన్ కొత్త రికార్డు... ఒక కాయిన్ విలువ ఎన్ని డాలర్లకు సమానమో తెలుసా..?
Bitcoin
Follow us on

బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డులు సృష్టిస్తోంది. ఒక బిట్‌కాయిన్ విలువ 30వేల డాలర్లను తాకింది. అంటే మన కరెన్సీలో దీని విలువ 72 లక్షలకు సమానం. గత వారాంతంలో బిట్‌కాయిన్ విలువ 6 శాతం పెరిగింది. 2020లో బిట్‌కాయిన్ విలువ 300 శాతానికి పైగా పెరిగింది. తాజా లెగ్ హైతో కేవలం రెండు వారాల క్రితం 20,000 డాలర్లు దాటినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది. 2021 మొదటి మూడు రోజుల్లోనే బిట్‌కాయిన్ విలువ సుమారు 5,000 డాలర్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

వైరస్ కారణంగా పడిపోయిన విలువ…

కరోనా వైరస్ సంక్షోభం వల్ల గత ఏడాది మార్చిలో బిట్‌కాయిన్ విలువ 25 శాతం పడిపోయింది. అయితే తిరిగి నవంబర్ చివరలో మొదటిసారి 20,000 డాలర్లు మార్కును దాటి తిరిగి బౌన్స్ చేయగలిగింది. క్రిప్టోకరెన్సీ డిసెంబర్ 31 చివరి నాటికి బిట్‌కాయిన్ 10,000 డాలర్లు పెరిగింది. బిట్‌కాయిన్ విలువ పెరగడానికి ప్రధాన కారణం అమెరికా పెట్టుబడిదారులు పెద్దమొత్తంలో కొనుగోలు చేయడమే అని నిపుణులు తెలుపుతున్నారు. 2030 నాటికి బిట్‌కాయిన్ విలువ 1,35,000 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ కు పెరుగుతున్న జనాదరణ దృష్ట్యా భారత ప్రభుత్వం బిట్‌కాయిన్ లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖజానాకు జమ కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

 

Also Read: Telecom War: జియో ఆరోపణలను ఖండించిన ఎయిర్‌టెల్.. తమకు సంబంధం లేదంటూ డాట్ సెక్రటరీకి లేఖ…