Turkey Earthquake Video: ప్రకృతి ప్రళయాన్ని పసిగట్టిన పక్షులు.. టర్కీలో భూకంపానికి ముందు ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో..

|

Feb 07, 2023 | 9:49 AM

రెండు దేశాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూ టీమ్‌ ఇప్పటి వరకు 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీసింది. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా చెప్తున్నారు.

Turkey Earthquake Video: ప్రకృతి ప్రళయాన్ని పసిగట్టిన పక్షులు.. టర్కీలో భూకంపానికి ముందు ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో..
Turkey Earthquake
Follow us on

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ దేశాల్లో ప్రకంపనలకు టర్కీ, సిరియా దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. అంటే ఈ విలయం ఎంతటి శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. రెండు దేశాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూ టీమ్‌ ఇప్పటి వరకు 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీసింది. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా చెప్తున్నారు. మృతుల సంఖ్య కూడా ఇక్కడే అధికం కావడం టర్కీ వాసుల గుండెల్లో పెను విపత్తుగా మారింది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలో వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలడం ఒక ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చన్న భయం ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో భూకంపానికి ముందు అర్ధరాత్రి పక్షుల అరుపులు.. సంచారానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. భూకంపం ప్రమాదాన్ని పక్షులు, జంతువులు ముందే పసిగడుతాయా? సైంటిస్ట్‌లకు మించి అంచనా వేయగలవా? వాటి అరుపులు, కదలికలు భూకంపాన్ని హెచ్చరిస్తాయా? అంటే అవునని అంటోంది నిన్నటి టర్కీ ప్రమాదం.

అవును.. పక్షులు హెచ్చరించాయి. భూకంప కదలికలతో బెదిరిపోయాయి. భూకంప ధాటికి బిల్డింగ్‌లపై ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. శాస్త్రవేత్తల హెచ్చరికలను ఈ దృశ్యాలు నిజం చేశాయి. కాసేపటికే భూమిలో కంపనాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

భూకంప ధాటికి నేల చీలిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లో నేలకు చేరాయి. ఆ తర్వాత పరిస్థితి భయానకంగా మారింది. అన్ని ప్రదేశాలు శవాల దిబ్బలా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..