Independence Day: ప్రధాని నరేంద్ర మోదీపై బిల్ గేట్స్ ప్రశంసలు.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వజ్రోత్సవాలు జరపుకుంటున్న వేళ.. భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలు, పలువురు ప్రముఖులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day: ప్రధాని నరేంద్ర మోదీపై బిల్ గేట్స్ ప్రశంసలు.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు
Bill Gates Pm Modi(File Photo)

Edited By: Janardhan Veluru

Updated on: Aug 15, 2022 | 12:45 PM

Independence Day: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వజ్రోత్సవాలు జరపుకుంటున్న వేళ.. భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలు, పలువురు ప్రముఖులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ దేశానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ట్వీట్ చేశారు. భారతదేశం స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకంటున్న సందర్భంగాఅభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూనే.. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ రంగాలకు ప్రాధన్యతనిస్తూ.. ఈరంగాల్లో ఎంతో పురగతి సాధిస్తున్నారని బిల్ గేట్స్ తెలిపారు. ఈస్ఫూర్తిదాయక పురోగతిలో భాగస్వాములు కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

.మరోవైపు సింగపూర్ హైకమిషన్ కూడా భారత్ కు 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలిపింది. భారత్ కు 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మా ప్రియమిత్ర దేశం ఎన్నో విశేషమైన విజయాలు సాధిస్తూ.. దేశం ముందుకు సాగడం ఆనందంగా ఉందని తెలిపింది. పలు రంగాల్లో పరస్పర సహకారంతో ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయని.. ఈబంధాన్ని మరింత బలోపేతమవుతుందని ట్విట్టర్ లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..