Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశంలో హింసాత్మక సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో హిందువుల సహా మైనార్టీల పై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిని బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ పాలనలో ఒక గుంపు ధ్వంసం చేసింది. అనంతరం ఆ బృందం ఠాగూర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు
Tagore's House Attacked In Bangladesh

Updated on: Jun 13, 2025 | 11:20 AM

బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశంలో తరచుగా హింసాత్మక సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోసిరాజ్‌గంజ్ జిల్లాలోని షాజహాన్‌పూర్‌లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన చారిత్రాత్మక ఇల్లుని రవీంద్ర కచ్చరిబరిని ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇంటి కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. ఒక సందర్శకుడు తన కుటుంబంతో కలిసి కచ్చరిబరిని సందర్శించడానికి వచ్చి మోటార్ సైకిల్ పార్కింగ్ ఛార్జీల విషయంలో ఒక ఉద్యోగితో వాగ్వాదానికి దిగడంతో వివాదం ప్రారంభమైంది. స్థానిక నివేదికల ప్రకారం సందర్శకుడిని కార్యాలయంలోకి లాక్కెళ్లి కొట్టారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై భారతదేశం పార్లమెంటులో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక ప్రకటన విడుదల చేసింది.

హింస, నినాదాలు, నిరసనలు తరువాత ఆగ్రహంతో ఉన్న ప్రజలు సంఘటనా స్థలంలో నిరసన తెలిపారు. వెంటనే ఈ బృందం కచ్చారిబారి ప్రాంగణంలోకి ప్రవేశించి ఆడిటోరియం, ఆఫీసుని ధ్వంసం చేయడం ప్రారంభించింది. నివేదికల ప్రకారం దాడి చేసిన వారిలో జమాతే-ఇ-ఇస్లామి, హెఫాజత్-ఇ-ఇస్లాం వంటి రాడికల్ సంస్థల సభ్యులు ఉన్నారు. వీరు ఠాగూర్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఇంతలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పై కూడా దాడి జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కచ్చరిబారిని మూసివేసినట్లు ప్రకటించారు.

కచ్చారిబారిపై దాడి చేయడం అంటే సాహిత్య వారసత్వంపై దాడి జరగడమే అని అంటున్నారు. ఇక్కడేఠాగూర్ సోనార్ టోరి, చైతాలి వంటి ప్రసిద్ధ కవితా సంకలనను రాశారు. ఈ స్థలాన్ని ఆయన కుటుంబ జమీందారీ కార్యాలయంగా కూడా ఉపయోగించారు. ఈ దాడిని సాంస్కృతిక వారసత్వంపై దాడిగా మాత్రమే కాదు.. దేశం గుర్తింపుపై దాడిగా కూడా చూస్తున్నారు.

రాజకీయ వాతావరణం , ప్రతిచర్యలతో ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై ఇప్పటికే అసంతృప్తితో నిండి ఉంది. ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఢాకాలో బహిరంగ కార్యక్రమాలను నిషేధించారు. యూనస్ అధికారిక నివాసాన్ని సీలు చేశారు. ఇది పాలనలోని అస్థిరతను బహిరంగ పరుస్తోంది.

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రవీంద్ర ఠాగూర్ కి చెందిన సాంస్కృతిక వారసత్వంపై దాడి చేయడం అంటే.. ఆ దేశంలోని సామాజిక-సాంస్కృతిక నిర్మాణానికి ప్రమాదకరమైన సంకేతం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ విషయంలో యూనస్ ప్రభుత్వం ఎంత పారదర్శకత, కఠినత్వాన్ని చూపించగలిగిందనే విషయంపై ఉంది

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..