Bangladesh Train Accident: 20 మంది మృతి, 100 మందికి గాయాలు.. ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీ.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢాకా వెళ్లే గోధూళి ఎక్స్ ప్రెస్ రైలు, ఛటోగ్రామ్ వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. సాయంత్రం 4 గంటల సమయంలో... కిషోర్‌గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర జరిగిందీ ఘటన. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి రావడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది.

Bangladesh Train Accident: 20 మంది మృతి, 100 మందికి గాయాలు.. ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీ.
Bangladesh Train Accident

Updated on: Oct 23, 2023 | 10:01 PM

ఢాకా, అక్టోబర్ 23: బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్‌లో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల (50 మైళ్లు) దూరంలో ఉన్న భైరబ్ వద్ద ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొనడంతో రైలు ప్రమాదం సంభవించింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం తెలిపారు.  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. బంగ్లాదేశ్ మీడియా ప్రకారం, మృతుల సంఖ్య 20 దాటింది. ఈ ఘోర రైలు ప్రమాదం తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. వార్తా సంస్థ ప్రకారం, సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం తెలిపారు.

రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి రావడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. దెబ్బతిన్న కోచ్‌లకింద అనేక మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటనా ప్రాంతం అంతా క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లింది. యాంటీ-క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ నేతృత్వంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. డజను దాకా అగ్నిమాపక దళాలు రాత్రంగా శ్రమించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ప్రమాదానికి అసలు కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. విచారణ తర్వాత వూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దుర్ఘటన కారణంగా బంగ్లాదేశ్‌లో అనేక రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం