బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. నిరాశ్రయులైన 10 వేలమంది

బంగ్లాదేశ్ రాజధానిలో రద్దీగా ఉండే మురికివాడలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం 10,000 మంది నిరాశ్రయులయ్యారు. శుక్రవారం అర్థరాత్రి ఢాకా మీర్పూర్ పరిసరాల్లో మంటలు చెలరేగాయి, దాదాపు 2 వేల మంది టిన్ షాక్లను ధ్వంసం చేశారని అగ్నిమాపక సేవల అధికారి ఎర్షాద్ హుస్సేన్ తెలిపారు. అధికారులు చివరికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని, చాలమందికి గాయాలైనట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈద్ అల్-అధా సెలవు దినం కావడంతో ఆ రోజు […]

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. నిరాశ్రయులైన 10 వేలమంది

Edited By:

Updated on: Aug 18, 2019 | 2:24 PM

బంగ్లాదేశ్ రాజధానిలో రద్దీగా ఉండే మురికివాడలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం 10,000 మంది నిరాశ్రయులయ్యారు. శుక్రవారం అర్థరాత్రి ఢాకా మీర్పూర్ పరిసరాల్లో మంటలు చెలరేగాయి, దాదాపు 2 వేల మంది టిన్ షాక్లను ధ్వంసం చేశారని అగ్నిమాపక సేవల అధికారి ఎర్షాద్ హుస్సేన్ తెలిపారు. అధికారులు చివరికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని, చాలమందికి గాయాలైనట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఈద్ అల్-అధా సెలవు దినం కావడంతో ఆ రోజు తమ కుటుంబాలతో గడిపేందుకు చాలమంది అక్కడ లేరు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో తక్కువ ఆదాయం సమకూర్చుకునే వస్త్ర రంగానికి చెందిన కార్మికులు నివసిస్తుంటారు. వీరు కూడా ప్రమాద సమయంలో లేకపోవడం మంచిదైందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఒకవేళ వీరంతా అక్కడ ఉండి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు చెప్పారు. అయితే గాయాలపాలైన వారిని రక్షించి వైద్యాన్ని అందిస్తున్నామని, నిరాశ్రయులైన వారికి ఆహారం, మంచినీరు, మొబైల్ మరుగుదొడ్లు, తాత్కాలిక విద్యుత్ సరఫరాను అందిస్తున్నట్టు మున్సిపల్ అధికారి షఫీల్ అజామ్ తెలిపారు. తాత్కాలిక టెంట్లు వేసి వీరికి వసతి కల్పిస్తున్నామని, అయితే వర్షం కురుస్తుండటంతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారిపోయిందని తెలిపారు.