పాక్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న బలుచిస్తాన్‌..! మనకంటే వాళ్లే స్పీడ్‌గా ఉన్నారుగా..

భారతదేశంతో సరిహద్దు వివాదాలతో అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్, బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటును కూడా ఎదుర్కొంటోంది. బీఎల్ఏ 39 చోట్ల పాక్ ఆర్మీపై దాడులు చేసింది. పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకున్నట్లు, హైవేలను నిర్బంధించినట్లు సమాచారం. పాకిస్థాన్ సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

పాక్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న బలుచిస్తాన్‌..! మనకంటే వాళ్లే స్పీడ్‌గా ఉన్నారుగా..
Balochistan Liberation Army

Updated on: May 10, 2025 | 12:54 PM

ఇక వైపు ఇండియా చేస్తున్న దాడులకు అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్‌.. మరోవైపు బలుచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ చేస్తున్న దాడులతో అట్టుడుకుతోంది. భారత సైన్యంతో తలపడలేక.. సరిహద్దుల్లోని గ్రామాలపై దాడులు చేస్తూ సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంది పాక్‌ సైన్యం. అయితే.. వారికి వారి దేశంలోని తిరుగుబాటు దాడులతో పెద్ద తలనొప్పిగా మారింది. బలుచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ.. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరిట వేర్పాటువాదులు పాక్‌ సైనికులకు దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్తాన్‌ ఆర్మీని బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ‌ సాయుధులు తరుముతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

బలూచిస్తాన్‌లో 39 చోట్ల పాక్‌ ఆర్మీపై మెరుపుదాడులు చేసింది బీఎల్‌ఏ. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని పోలీస్‌ స్టేషన్లను వాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే బలూచ్‌ ప్రాంతంలోని హైవేలను నిర్బంధిస్తోంది బీఎల్‌ఏ. పాక్‌ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను అరెస్ట్‌ చేస్తున్నారు. పాక్‌ బలగాలు కనిపిస్తేచాలు దాడులకు తెగబడుతున్నారు. పాక్‌ ఆర్మీ వాహనాలను వెంబడించి కాల్పులు జరిపిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. బలూచ్‌ మెరుపుదాడితో పాక్‌ జవాన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బలూచిస్తాన్‌లో ఒక చోట పాక్‌ జవాన్లపైకి కాల్పులు జరిపింది బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ. ఇక వైపు ఇండియాతో పోరాడుతూనే.. మరోవైపు బలూచిస్తాన్‌లో దాడులు ఎదుర్కొంటోంది పాకిస్థాన్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి