పాక్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచ్ ఆర్మీ.. 29మంది శత్రు సైనికులు మృతి.. గత 6నెలల్లో ఎంత మంది అంటే..?

చిన్న తిరుగుబాటు దళం అనుకుంటే పాక్‌కు పక్కలో బల్లెంలా మారింది బలూచిస్థాన్ ఆర్మీ. వరుస దాడులకు దిగుతూ మన శతృదేహానికి చుక్కలు చూపిస్తోంది. తాజాగా మరో రెండు చోట్ల బీఎల్ఏ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 29మంది పాక్ సైనికులు మరణించారు. ఇప్పటివరకు ఎంత మంది పాక్ సైనికులు చనిపోయారనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాక్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచ్ ఆర్మీ.. 29మంది శత్రు సైనికులు మృతి.. గత 6నెలల్లో ఎంత మంది అంటే..?
Baloch Army

Updated on: Jul 17, 2025 | 4:38 PM

మన శతృదేశం పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. వరుస దాడులకు దిగుతూ పాక్ సైన్యాన్ని ఊచకోత కోస్తుంది. ఇప్పటికే బలూచ్ ఆర్మీ దాడుల్లో ఎంతో మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి పాక్ సైన్యంపై బలూచ్ ఆర్మీ దాడులకు పాల్పడింది. క్వెట్టా, కలాత్‌లో దాడులు చేసింది. ఈ దాడుల్లో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ముందుగా కలాత్‌లో సైన్యాన్ని తరలిస్తున్న బస్సుపై బలూచ్ ఆర్మీ దాడికి దిగింది. ఇందులో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత క్వెట్టాలోని హాజర్‌గంజ్‌లో ఐఈడీ బాంబు పేల్చి మరో ఇద్దరు సైనికులను చంపేసింది. ఈ విషయాన్ని బీఎల్ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చనిపోయిన వారిలో మేజర్ స్థాయి అధికారులు ఉండడం గమనార్హం. గత కొంత కాలంగా బీఎల్ఏ దాడుల్లో పాక్ భారీగా సైన్యాన్ని నష్టపోతుంది. జనవరి – జూన్ మధ్య బీఎల్ఏ మొత్తం 286 దాడులకు పాల్పడింది. ఇందులో 9 స్పెషల్ ఆపరేషన్లు, 3 ఆత్మహుతి దాడులు ఉన్నాయి. ఈ దాడుల్లో 697మంది పాక్ సైనికులు మరణించారు. మరో 290 మంది సైనికులని బీఎల్ఏ నిర్భంధించింది. పాక్‌కు చెందిన 133 వాహనాలను ధ్వంసం చేసింది. ట్రైన్ హైజాక్ తో పాటు 17 సైనిక స్థావరాలను దెబ్బతీసింది. పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

ఒక చిన్న దళం చేతిలో పాక్ ఇంత స్థాయిలో నష్టపోవడం గమనార్హం. అదే సమయంలో మెరుగైన కార్యాచరణ, సమన్వయంతో బీఆఎల్ఏ దూసుకపోతుంది. అంతేకాకుండా 45 ప్రాంతాలను పాక్ ఆర్మీ నియంత్రణ నుంచి స్వాధీనం చేసుకుంది. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కార్యాచరణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు సరఫరా మార్గాలు, కమ్యూనికేషన్, సైనిక లాజిస్టిక్‌లకు అంతరాయం కలిగించడంపై బీఎల్ఏ ఎక్కువ ఫోకస్ పెట్టింది. 17 సైనిక స్థావరాలను నాశనం చేసి, విస్తృతమైన ఆయుధ నిల్వలను స్వాధీనం చేసుకోవడం బలూచ్‌లో వారి పట్టు ఏ విధంగా ప్రపంచానికి చూపించింది. ఇక పాకిస్థాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఏడుగురు ఫిదాయీన్ యోధులతో సహా 36 మంది బీఎల్ఏ యోధులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ మాత్రం బీఎల్ఏ దాడులను బయటకు తెలినీకుండా ఎక్కడికక్కడ రహస్యంగా ఉంచుతుంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆ దేశం భయం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..