
జూలై 1వ తేదీ 2025 న మన సౌర వ్యవస్థలో ప్రవేశించిన 3I/ATLAS అనే అరుదైన వస్తువుని న ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ 3I/ATLAS వస్తువు గంటకు 130,000 మైళ్ల అసాధారణ వేగంతో మన సౌర వ్యవస్థలోకి ప్రవేశిస్తోందని గుర్తించారు. ఈ 15 మైళ్ల వెడల్పు గల వస్తువు చాలా పెద్దది. దీనిని న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కంటే పెద్దదిగా పరిగణిస్తున్నారు. ప్రారంభంలో దీనిని ఒక తోకచుక్క అని భావించారు. అయితే ఇది హైపర్బోలిక్ ఆకారంలో ప్రయాణిస్తుండడంతో ఈ వస్తువు సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిందని.. ఇది బహుశా గ్రహాంతరవాసుల సాంకేతికత సంబంధించినది అయి ఉండవచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అవీ లోబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ జాబితాలో Oumuamua (2017), 2I/Borisov (2019) లకు ముందు.. ఇప్పటివరకు కనిపించిన ఇటు వంటి వస్తువుల్లో ఇది మూడవది మాత్రమే. ఈ 3I/ATLAS హైపర్బోలిక్ ఆకారంలో ప్రయాణిస్తుందని.. సూర్యుని చుట్టూ మూసిన కక్ష్యలో తిరగదని నాసా (NASA) వివరించింది. అంటే.. ఇది మన సౌర వ్యవస్థ గుండా వెళుతోందని.. ఆపై అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అర్థం.
హార్వర్డ్ శాస్త్రవేత్త అవీ లోబ్ హెచ్చరిక
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ అవి లోబ్, 3I/ATLAS అనేది ఒక సాధారణ సహజ వస్తువు కాదని చెబుతున్నారు. దీని మార్గం ఉద్దేశపూర్వకంగా నిర్దేశించబడినట్లు కనిపిస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఇది బృహస్పతి, అంగారక గ్రహం, శుక్ర గ్రహాల దగ్గరకు వెళుతుంది.. ఇది ఒక ఆదర్శ బిందువు. ఇది 2025 నవంబర్‌లో సూర్యుని దగ్గర పెరిహెలియన్ వద్ద ఉంటుందని చెప్పారు. మొత్తానికి ఏలియన్ టెక్నాలజీ సౌర వ్యవస్థ లోపలి భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ వస్తువు మానవ నిఘాను నివారించడానికి ప్రయత్నించవచ్చు అని లోబ్ అభిప్రాయపడ్డారు. అయితే లోబ్ వాదనని ఇతర శాస్త్రవేత్తలు కొట్టిపడేస్తున్నారు. ఈ విషయంపై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) లో ప్లానెటరీ డిఫెన్స్ హెడ్ రిచర్డ్ మోయిస్ల్ మాట్లాడుతూ తమకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3I/ATLASకు తన మూలాలను సూచించే ఎలాంటి సంకేతాలు లేవని తెలిపారు.
బాబా వంగా అంచనా 2025లో ఏలియన్ కాంటాక్ట్?
బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, ప్రవక్త బాబా వంగా, 9/11, బ్రెక్సిట్, 2004 సునామీ వంటి సంఘటనలను అంచనా వేశారు. ఇవి నిజం కావడంతో ప్రతి ఏడాది బాబా వంగా అంచనాలపై దృష్టి సారిస్తారు. 2025 లో మానవాళికి గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం ఉంటుందని ఇప్పటికే వంగా చెప్పిన విషయాన్నీ కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. ఆ వాదనకు నిజం అంటూ ఇప్పుడు 3I/ATLAS వస్తువు శాస్త్రజ్ఞుల కంట పడింది. దీంతో శాస్త్రవేత్తలు కూడా గ్రహాంతరవాసులు భూమి మీదకు వచ్చే అవకాశాలున్నయా అని పరిశీలిస్తున్నారు. దీంతో ఈ అంచనా మరోసారి వార్తల్లో నిలిచింది.
డార్క్ ఫారెస్ట్ సిద్ధాంతం, సంభావ్య ముప్పు
డార్క్ ఫారెస్ట్ పరికల్పన ప్రకారం.. అధునాతన నాగరికతలు శత్రు జాతుల దృష్టిని ఆకర్షించకుండా తమను తాము దాచుకుంటాయి. 3I/ATLAS నిజంగా గ్రహాంతరవాసుల మిషన్ అయితే.. అది చురుకైన నిఘా మిషన్ అయ్యే అవకాశం ఉంది. గ్రహాంతరవాసులు భూమిని రహస్యంగా పరిశోధిస్తూ ఉండవచ్చు. దీని ఉద్దేశ్యం యుద్ధం కాకపోవచ్చు. అయితే ఇది వ్యూహాత్మక తనిఖీ లేదా సంభావ్య దండయాత్ర. ఇది నిజమైతే.. గ్రహాంతరవాసుల ముప్పును దృష్టిలో ఉంచుకుని మన గ్రహ రక్షణ వ్యవస్థను పునఃరూపకల్పన చేయాలని లోబ్ విశ్వసిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..