చర్చిలో కాల్పులు.. ఇది కూడా జిహాదీల పనేనా..?

| Edited By:

May 13, 2019 | 10:02 AM

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దుండగులు రెచ్చిపోయారు. డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించిన కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9గంటలకు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సాయుధులైన కొందరు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని ఆయన వివరించారు. దుండగుల కాల్పులతో […]

చర్చిలో కాల్పులు.. ఇది కూడా జిహాదీల పనేనా..?
Follow us on

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దుండగులు రెచ్చిపోయారు. డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించిన కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9గంటలకు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సాయుధులైన కొందరు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని ఆయన వివరించారు. దుండగుల కాల్పులతో అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. కాగా ఐదు వారాల వ్యవధిలో ఆ దేశంలో క్రిస్టియన్స్ లక్ష్యంగా కాల్పులు జరపడం ఇది మూడోసారి.