మధ్య ఆసియాలోని రెండు దేశాలైన అర్మేనియా-అజర్‌బైజాన్‌ల మధ్య నాగోర్నో-కరాబాఖ్‌పై జరుగుతున్న యుద్ధం తీవ్రతరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయని ఆరోపించారు. వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరాబాఖ్‌లో అజర్‌బైజాన్, అర్మేనియన్ దళాల మధ్య పోరాటాన్ని ముగించడంపై చర్చలు నిర్వహించడానికి రష్యా ముందుకొచ్చింది. విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రెండు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆయన కార్యాలయం తెలిపింది యుద్ధం వెంటనే నిలిపివేయాలని సెర్గీ లావ్‌రోవ్ కోరారు.
సోవియట్ రష్యా నుండి విడిపోయిన అర్మేనియా- అజర్‌బైజాన్ మధ్య యుద్ధం జరిగింది. నాగోర్నో-కరాబాఖ్‌పై రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లు వివాదం కొనసాగుతోంది రెండు దేశాలు ట్యాంకులు, ఫిరంగి దాడులు, పోరాట హెలికాప్టర్లను ప్రయోగించాయి. ఈ దాడిలో సాధారణ పౌరులు మరణించడాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. అయితే, తాజా పరిణామాలతో అంతర్జాతీయ శక్తులను సంఘర్షణలోకి లాగవచ్చనే భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చింది. బుధవారం లావ్రోవ్ కార్యాలయం అర్మేనియా, అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రులను పిలిచి రష్యా చర్చలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో పోరాటం గురించి ప్రత్యేక టెలిఫోన్ కాల్‌లో చర్చించారు. తక్షణ కాల్పుల విరమణ చేయాలంటూ ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు.
మరోవైపు, నాగోర్నో-కరాబాఖ్‌పై కొనసాగుతున్న సంఘర్షణను వెంటనే ఆపాలని యుఎన్ భద్రతా మండలి అర్మేనియా – అజర్‌బైజాన్‌లను అభ్యర్థించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత శక్తివంతమైన సంస్థ బలగాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించింది. పోరాటాన్ని వెంటనే ఆపివేసి అర్ధవంతమైన చర్యల కోసం ముందుకు రావాలని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారేస్ అభ్యర్థించారు.