బర్త్ డే పార్టీ చేసుకున్నందుకు ప్రెసిడెంట్‌కే భారీ జరిమానా విధించారు..ఎంతో తెలిస్తే షాకే!

|

May 24, 2022 | 5:47 PM

అతడో దేశాక్షుడు..అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌...అతడి భార్య ఫాబియోలా యేనెజ్‌కు భారీ ఫైన్‌ పడింది. అధికారులు విధించిన 24వేల డాలర్లను (దాదాపు 18.63లక్షలు) జరిమాన చెల్లించాల్సి వచ్చింది.

బర్త్ డే పార్టీ చేసుకున్నందుకు ప్రెసిడెంట్‌కే భారీ జరిమానా విధించారు..ఎంతో తెలిస్తే షాకే!
Argentinas Pres
Follow us on

అతడో దేశాక్షుడు..అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌…అతడి భార్య ఫాబియోలా యేనెజ్‌కు భారీ ఫైన్‌ పడింది. అధికారులు విధించిన 24వేల డాలర్లను (దాదాపు 18.63లక్షలు) జరిమాన చెల్లించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అర్జెంటీనా అధ్యక్షుడు, అతని భార్య ఈ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఎంటా నింబధన, వాళ్లు చేసిన తప్పిందం ఏంటన్నది పూర్తి వివరాల్లోకి వెళ్లి పరిశీలించినట్టయితే….

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ సమయంలో పుట్టినరోజు జరుపుకున్న అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండెజ్‌కు జరిమానా విధించారు అక్కడి అధికారులు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బర్త్ డే పార్టీ చేసుకున్నందుకు గానూ ఆల్బెర్టో ఫెర్నాండేజ్, అతని భార్య ఫాబియోలా యేనెజ్ జరిమానా కట్టారు. ఇద్దరూ కలిసి 24 వేల డాలర్ల (దాదాపు 18.63 లక్షలు)ను వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్‌కు చెల్లించారు..

2020 జులైలో అర్జెంటీనా ఫస్ట్ లేడీ ఫాబియోలా యేనెజ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. అప్పుడు అక్కడ కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయం. ఆ టైమ్‌లో ఫాబియోలా బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఆ పార్టీపై అర్జెంటీనా ఫెడరల్ కోర్టులో విచారణ జరిగింది. పార్టీ వెనుక ఎలాంటి హానికర ఉద్దేశాలు లేవని, అది కేవలం నిర్లక్ష్యం వల్లే జరిగిందని అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. దీంతో కోర్టు అధ్యక్షుడికి, మొదటి మహిళకు జరిమానా విధించింది. అధ్యక్షుడికి 1.6 మిలియన్ పోసెస్‌లు, మొదటి మహిళకు 1.4 మిలియన్ పోసెస్‌లు జరిమానా విధించింది. ఆ డబ్బులను ఇద్దరూ మాల్‌బ్రాన్ వ్యాక్సిన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా అందించాలని ఆదేశించింది. కాగా, ఆ జరిమానాను ఇద్దరూ తాజాగా కట్టేశారు.

ఇవి కూడా చదవండి