Alibaba Group: ఆలీబాబా సంపద హారతి… ఏకంగా 8.5 లక్షల కోట్లు ఉఫ్… చైనా నిర్ణయంతో మరింత కష్టాల్లోకి…

చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఆలీబాబా  తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆలీబాబా కంపెనీ ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూస్తోంది.

Alibaba Group: ఆలీబాబా సంపద హారతి... ఏకంగా 8.5 లక్షల కోట్లు ఉఫ్... చైనా నిర్ణయంతో మరింత కష్టాల్లోకి...
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2020 | 5:33 AM

చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఆలీబాబా  తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆలీబాబా కంపెనీ ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూస్తోంది. అయితే సంస్థను బలంగా నిలుపేందుకు సదరు సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు.

చైనా ప్రభుత్వ నిర్ణయంతో ….

ఆలీబాబా అనుబంధ సంస్థపై యాంటీట్రస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ నిర్వహిస్తామని చైనా నియంత్రణ సంస్థల అధికారులు ప్రకటించారు. దీంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో ఆలీబాబా షేర్‌ విలువ దాదాపు 15శాతం పతనమైంది. యాంటీ ట్రస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌తో ఏ స్థాయిలో జరిమానాలు విధిస్తారో అనే భయంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆలీబాబా షేర్‌ను విక్రయిస్తున్నారు.

కాగా ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా అనుబంధ యాంట్‌ సంస్థపై జాక్‌ మా ఐపీవోకు వెళ్లారు. తొలుత ప్రతిపాదించిన 6 బిలియన్‌ డాలర్ల బైబ్యాక్‌ను 10 బిలియన్‌ డాలర్లకు పెంచేందుకు ఆలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022 వరకూ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలిపినా ఉపయోగం లేకపోయింది. ట్రేడింగ్‌లో ఆలీబాబా షేర్‌ 222 డాలర్ల వద్ద ముగిసింది. వరుసగా రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అలీబాబా సంపద 116 బిలియన్‌ డాలర్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. అంటే మన కరెన్సీలో రూ.8.5 లక్షల కోట్లన్నమాట.