మరోసారి కదం తొక్కిన అమెరికన్లు.. మొన్న ‘హ్యాండ్సాఫ్‌’.. ఇవాళ యాంటీ ట్రంప్‌ పేరుతో భారీ నిరసన…!

మొన్న ‘హ్యాండ్సాఫ్‌’ పేరుతో అది పెద్ద ఆందోళన.. ఇవాళ యాంటీ ట్రంప్‌ పేరుతో భారీ నిరసన...! అమెరికన్లు మరోసారి కదం తొక్కారు. దేశవ్యాప్తంగా వరదను తలపించేలా నడిరోడ్లపైకి వచ్చి.. ఆందోళనలు చేపట్టారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ నియంత పోకడలను నిరసిస్తూ గేలిచేశారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

మరోసారి కదం తొక్కిన అమెరికన్లు.. మొన్న ‘హ్యాండ్సాఫ్‌’..  ఇవాళ యాంటీ ట్రంప్‌ పేరుతో భారీ నిరసన...!
Anti Trump Protesters Rally

Updated on: Apr 20, 2025 | 4:58 PM

మొన్న ‘హ్యాండ్సాఫ్‌’ పేరుతో అది పెద్ద ఆందోళన.. ఇవాళ యాంటీ ట్రంప్‌ పేరుతో భారీ నిరసన…! అమెరికన్లు మరోసారి కదం తొక్కారు. దేశవ్యాప్తంగా వరదను తలపించేలా నడిరోడ్లపైకి వచ్చి.. ఆందోళనలు చేపట్టారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ నియంత పోకడలను నిరసిస్తూ గేలిచేశారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ట్రంప్‌నకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు.. వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం ఇలా.. అనేక పరిణామాలను నిరసిస్తూ.. జనం రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా మరోసారి ప్రధాన నగర వీధుల్లో ప్లకార్డులతో ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

న్యూయార్క్‌లోని ప్రధాన గ్రంథాలయం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్న అమెరికన్లు.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ‘అమెరికాలో రాజులు ఎవరూ లేరు..’, ‘ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి..’ ‘ఫాసిజం వద్దు’ అంటూ నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. ‘‘ఎలాంటి భయం లేదు.. వలసదారులకు స్వాగతం’’ అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్‌ పాలన సాగుతోందన్నారు. ఆయన తీరు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలావుంటే, ఎఫ్‌-1 విద్యార్థి వీసా ముగిసినా అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనాకు చెందిన విద్యార్థిని లెకా కోర్డియాను అక్కడి అధికారులు అరెస్ట్‌ చేశారు. మరో పాలస్తీనా విద్యార్థిని కూడా అంతకు ముందు అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, వీసా రద్దు అవుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉంటున్నారు. ఇప్పటివరకు మొత్తంగా వీసా రద్దుల్లో దాదాపు 50శాతం మంది భారతీయులవేనని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్​ అసోషియేషన్​ -AILA తెలిపింది.

ట్రంప్‌ పని తీరును నిరసిస్తూ ఇటీవల అమెరికా ప్రజలు దేశమంతటా ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్‌ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి ‘హ్యాండ్సాఫ్‌’ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతి పెద్ద నిరసన ఇదే. దాదాపు 50 రాష్ట్రాల్లోని 1,200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ ‘హ్యాండ్సాఫ్‌’ ఆందోళనలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఇంత తక్కువ టైమ్‌లోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళనకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..