ఘోర ప్రమాదం.. బీచ్‌‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం!

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. గాల్వెస్టన్ సమీపంలో మెక్సికన్ నేవీ విమానం కూలిపోయింది. అందులో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక అనారోగ్య యువకుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించారు. టెక్సాస్ తీరంలో మిగిలిన ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలింపు జరుగుతోంది.

ఘోర ప్రమాదం.. బీచ్‌‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం!
Mexican Air Ambulance Crash

Updated on: Dec 23, 2025 | 1:46 PM

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. గాల్వెస్టన్ సమీపంలో మెక్సికన్ నేవీ విమానం కూలిపోయింది. అందులో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక అనారోగ్య యువకుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించారు. టెక్సాస్ తీరంలో మిగిలిన ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలింపు జరుగుతోంది. విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ నిర్ధారించింది. అయితే, ప్రమాదానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం (డిసెంబర్ 22) మధ్యాహ్నం గాల్వెస్టన్ సమీపంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. విమానం వైద్య సహాయం కోసం వెళుతోందని, అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మెక్సికన్ నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానంలో నలుగురు నావికాదళ అధికారులు, ఒక చిన్నారితో సహా నలుగురు పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. “ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. అదనపు సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే విడుదల చేయబడుతుంది” అని గాల్వెస్టన్ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మిచు, మౌయి ఫౌండేషన్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఈ సంస్థ తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న మెక్సికన్ పిల్లలకు చికిత్స, సహాయం అందించే లాభాపేక్షలేని సంస్థ. విమానం వైద్య సహాయ కార్యక్రమంలో భాగంగా కాలిన రోగిని చికిత్స కోసం తీసుకువెళుతున్నట్లు సమాచారం. టెక్సాస్ తీరంలో హూస్టన్‌కు ఆగ్నేయంగా 50 మైళ్ల దూరంలో ఉన్న గాల్వెస్టన్ సమీపంలోని కాజ్‌వే బేస్ ఏరియా సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

గాల్వెస్టన్ అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందిన ద్వీపం. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతాన్ని పొగమంచు ఆవరించింది. అయితే, విమాన ప్రమాదానికి చెడు వాతావరణం కారణమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై మెక్సికన్ నేవీ దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..