Amazon Rainforest Fire : తగలబడుతున్న అమెజాన్ ఫారెస్ట్.. నాసా తీసిన చిత్రం

| Edited By:

Aug 23, 2019 | 2:01 PM

అమెజాన్ అడవులు.. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారం ఈ అడవులే. అయితే ఇప్పుడు ఈ అమెజాన్ అడవి కార్చిచ్చుతో మొత్తం పొగతో నిండిపోయింది. బ్రెజిల్‌కు చెందిన ఈ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. సాధారణంగా ఈ సమయంలో అక్కడి అడవుల్లో ఇలా కార్చిచ్చు రగులుకోవడం సర్వసాధారణమే అయినా, ఈ సారి అది రికార్డు స్థాయిలో ఉంది. ఈ […]

Amazon Rainforest Fire : తగలబడుతున్న అమెజాన్ ఫారెస్ట్.. నాసా తీసిన చిత్రం
Follow us on

అమెజాన్ అడవులు.. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారం ఈ అడవులే. అయితే ఇప్పుడు ఈ అమెజాన్ అడవి కార్చిచ్చుతో మొత్తం పొగతో నిండిపోయింది. బ్రెజిల్‌కు చెందిన ఈ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

సాధారణంగా ఈ సమయంలో అక్కడి అడవుల్లో ఇలా కార్చిచ్చు రగులుకోవడం సర్వసాధారణమే అయినా, ఈ సారి అది రికార్డు స్థాయిలో ఉంది. ఈ తీవ్రతను శాటిలైట్ చిత్రాల్లో బంధించి నాసా ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ ట్వీట్‌ను అనేక మంది లైక్‌ చేయడంతో పాటు రీట్వీట్ చేశారు. దీనిపై ఆస్కార్ విజేత లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్‌ స్టార్లు అక్షయ్ కుమార్, అలియా భట్, టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ తదితరులు ట్విటర్‌లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

భూగ్రహం మీద 20శాతం ప్రాణవాయువును అందించే అటవీ ప్రాంతం ఇలా మంటల్లో చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు హాలీవుడ్ స్టార్‌ లియోనార్డో డికాప్రియో. రెండు వారాలకు పైగా కార్చిచ్చులో చిక్కుకుపోయిన అమెజాన్ అడవులను ఇలా చూడటం హృదయ విదారకరం, ఆందోళనక పరిణామన్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ వాతావరణ మార్పులతో భూగ్రహం తట్టుకుంటుందేమో కానీ, మన వల్ల కాదన్నారు.