కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను రెచ్చగొడతాం..సహకరించాలంటూ తాలిబన్లను కోరిన జైషే మహ్మద్ నేత

| Edited By: Anil kumar poka

Aug 28, 2021 | 11:47 AM

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు టెర్రరిస్టు సంస్థ జైషే మహ్మద్ ..తాలిబన్ల సాయం కోరింది. ఈ మేరకు సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ..కాందహార్ కి వెళ్లి తాలిబన్ల నాయకులతోనూ, పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్..

కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను రెచ్చగొడతాం..సహకరించాలంటూ తాలిబన్లను కోరిన జైషే మహ్మద్ నేత
Jaishe Mohammad Leader Masood Azhar
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు టెర్రరిస్టు సంస్థ జైషే మహ్మద్ ..తాలిబన్ల సాయం కోరింది. ఈ మేరకు సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ..కాందహార్ కి వెళ్లి తాలిబన్ల నాయకులతోనూ, పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ తోనూ భేటీ అయ్యారు. కాశ్మీర్ లో తమ సంస్థ ఆపరేషన్స్ ని ప్రారంభిస్తామని, ఇందుకు మీ సాయం కావాలని ఆయన కోరాడు. ఈ నెల 15 న కాబూల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం..వాళ్ళు విజయం సాధించారంటూ అజహర్ ‘పొంగిపోయాడు’.. ‘మంజిల్ కే తరాఫ్’ (గమ్యం దిశగా) అని ఓ పోస్టు పెట్టాడు. అంటే ఆఫ్ఘన్ కు మద్దతునిస్తున్న అమెరికా కుప్పకూలింది అన్నదే దీని ఉద్దేశమట.. పైగా ఈ పోస్ట్ తాలూకు సందేశాన్ని పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లో గల జైషే మహ్మద్ ప్రధానకార్యాలయం లో అంతా షేర్ చేసుకున్నారని తెలిసింది. ఒకరికొకరు గ్రీట్ చేసుకున్నారట కూడా..వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న మసూద్ అజహర్ పాకిస్థాన్ జైల్లో నామ మాత్రంగా జైలు శిక్ష అనుభవించాడు. అనేకమంది ఉగ్రవాదులను విడుదల చేసినట్టుగానే పాక్ ఇతడిని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

లోగడ భారత విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేసినప్పుడు..అందులోని ప్రయాణికులను వారి చెర నుంచి సురక్షితంగా రిలీజ్ చేయడానికి అనువుగా ఇతడిని కూడా భారత ప్రభుత్వం విడుదల చేసింది.ఖాట్మండు నుంచి లక్నో వెళ్తున్న విమానాన్ని నాడు హైజాకర్లు హైజాక్ చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను వ్యాపింప జేయడానికి తాలిబన్లు ..జైషే మహ్మద్ సంస్థను వినియోగించుకోవచ్చునని ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఆఫ్ఘన్ గడ్డను ఉగ్ర చర్యలకు వినియోగించుకోవడానికి తాము ఏ టెర్రరిస్టు సంస్థనూ అనుమతించబోమని వారు ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. వారి దృష్టి అంతా ఇలాంటి చర్యల మీదే ఉందన్న విషయం గమనార్షం.

మరిన్ని ఇక్కడ చూడండి: కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌..! నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..:Prakash Raj Remarried Video.

వామ్మో..స్కూటీ డిక్కీలో నాగుపాము..! ఎలా వచ్చిందో తెలిసా..?షాక్ లో ఓనర్..:Snake Viral Video.

కరోనా జాగ్రత్తలు మీకేనా ఏంటి మేము పాటిస్తాం అంటూ మాస్క్ వేసుకొని హంగామా చేసిన కోతి..:Monkey Wear Mask Video.

నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.