afghan crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద పెను ‘ఉగ్ర ముప్పు’..ఆఫ్ఘన్లు, విదేశీయులు తక్షణమే నిష్క్రమించాలన్న అమెరికా, బ్రిటన్ దేశాలు

కాబూల్ విమానాశ్రయం వద్ద పెను ఉగ్ర ముప్పు పొంచి ఉందని, అందువల్ల అక్కడున్న ఆఫ్ఘన్లు, విదేశీయులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అమెరికా, బ్రిటన్ దేశాలు హెచ్చరించాయి. విమానాశ్రయ సమీప ప్రాంతాలనుంచి వెళ్లిపోవాలని...

afghan crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద పెను ఉగ్ర ముప్పు..ఆఫ్ఘన్లు, విదేశీయులు  తక్షణమే నిష్క్రమించాలన్న అమెరికా, బ్రిటన్ దేశాలు
High Terror Threat At Kabul Air Port

Edited By:

Updated on: Aug 26, 2021 | 1:36 PM

కాబూల్ విమానాశ్రయం వద్ద పెను ఉగ్ర ముప్పు పొంచి ఉందని, అందువల్ల అక్కడున్న ఆఫ్ఘన్లు, విదేశీయులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అమెరికా, బ్రిటన్ దేశాలు హెచ్చరించాయి. విమానాశ్రయ సమీప ప్రాంతాలనుంచి వెళ్లిపోవాలని ఈ దేశాలు అడ్వైజరీలను జారీ చేశాయి. ఇప్పటికీ వేలాదిమంది ప్రజలు కాబూల్ నుంచి వెళ్లిపోయేందుకు తహతహలాడుతున్నారు. ఈ నెల 31 డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో వీరిలో ఆందోళన పెరుగుతోంది. దానికి తోడు అమెరికా గురువారం చేసిన ఈ తాజా హెచ్చరికతో వారు భయంతో వణికిపోతున్నారు. సాధ్యమైనంతగా ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లరాదని..ముఖ్యంగా ఎబే గేటు, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ వద్ద ఉన్నవారు తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలనీ ఈ హెచ్చరికల్లో కోరారు. లండన్ కూడా ఇదేవిధమైన హెచ్చరిక చేసింది. మీరు సురక్షితంగా ఆఫ్ఘన్ ను వీడాలనుకుంటే ఇక ఈ గేట్ల వద్ద ఉండకండి..సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని కోరింది. విమానాశ్రయం వద్ద ఉన్న అనేకమంది తమ విదేశీ పాస్ పోర్టులను, వీసాలను, ప్రయాణ సంబంధ పత్రాలను//అమెరికన్ దళాలకు చూపుతూ తాము ఇక్కడి నుంచి బయటపడేందుకు సాయపడాలని అభ్యర్థిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి మీకు ఉగ్రవాద ముప్పు ఉందని అమెరికా, బ్రిటన్ పేర్కొంటున్నాయి.

ఫ్రాన్స్ …ఈ రోజుతో ఇక కాబూల్ కు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అమెరికా, బ్రిటన్ దేశాల్లో ప్రజలను ఊచకోత కోశారు. మసీదులు, ప్రార్థనా మందిరాలు, బహిరంగ ప్రదేశాలు, చివరకు ఆస్పత్రుల్లో సైతం చొరబడి మారణకాండకు తెగబడుతూ వచ్చారు. షియాలతో బాటు తమకు వ్యతిరేకులని భావిస్తున్న ముస్లిములను వారు టార్గెట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్, తాలిబన్లు సున్నీ టెర్రరిస్టులే అయినా ఒకరికొకరు ప్రత్యర్థులే..

మరిన్ని ఇక్కడ చూడండి: ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.

మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.