Pizza Party: ఆమెను పిజ్జా పార్టీకి పిలవనందుకు 24 లక్షల రూపాయల జరిమానా కట్టిన కంపెనీ యాజమాన్యం..

|

May 12, 2021 | 8:46 PM

Pizza Party:  ఎవరైనా ఒక ఉద్యోగి పనిచేస్తున్న చోట జరిగిన పార్టీకి అతనిని పిలవకుండా పక్కన పెట్టేస్తే ఏం జరుగుతుంది. అదీ.. ఆ పార్టీకి కావలసిన తినుబండారాలు అన్నీ వారి ద్వారానే ఆర్డర్ చేయించి ఆనక ఆ పార్టీకి రానియకపోతే.. ఎంత అవమానంగా ఉంటుంది.

Pizza Party: ఆమెను పిజ్జా పార్టీకి పిలవనందుకు 24 లక్షల రూపాయల జరిమానా కట్టిన కంపెనీ యాజమాన్యం..
Pizza Party
Follow us on

Pizza Party:  ఎవరైనా ఒక ఉద్యోగి పనిచేస్తున్న చోట జరిగిన పార్టీకి అతనిని పిలవకుండా పక్కన పెట్టేస్తే ఏం జరుగుతుంది. అదీ.. ఆ పార్టీకి కావలసిన తినుబండారాలు అన్నీ వారి ద్వారానే ఆర్డర్ చేయించి ఆనక ఆ పార్టీకి రానియకపోతే.. ఎంత అవమానంగా ఉంటుంది. అక్కడ తినే తిండి గురించి కాదు.. సాటి ఉద్యోగుల వద్ద తనకు జరిగిన అవమానం ఎంత దారుణంగా ఉంటుంది. ఊహించండి. అవునుకదా. కానీ, సాధారణంగా ఇటువంటి విషయాలను పెద్దది చేయకుండా వదిలేస్తారు చాలా మంది. కానీ, ఆమె అలాకాదు. తనని పిలవనందుకు ఏకంగా కోర్టుకు వెళ్ళింది. తనను కావాలనే అవమానించారంటూ ఆధారాలతో సహా నిరూపించింది. ఆమె చేసిన పోరాటానికి ఫలితం ఎంతో తెలుసా 23 వేల పౌండ్లు.. అంటే, దాదాపుగా 24 లక్షల రూపాయలు.

ఒక కారు డీలర్ షిప్ లో మాల్గొర్జాటా లెవికా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. ఆమె ‘హార్ట్‌వెల్’ వద్ద పనిచేస్తోంది. అక్కడ తోటి సిబ్బంది తరచూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. దానికి కావలసిన పిజ్జాల నుంచి బర్గర్ల వరకూ రిసెప్షనిస్ట్ గా ఈమె తోనే ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారు. కానీ, ఆమెను మాత్రం పార్టీకి పిలవరు. ఒకరోజు ఇలాంటిదే జరిగింది. ఇక ఆమెలో సహనం చచ్చిపోయింది. ఇంతకీ, ఆమెను ఎందుకు పార్టీలకు పిలవరో తెలుసా? ఆమె వాట్ఫోర్డ్ శాఖ నుండి, అక్కడకు బదిలీపై వచ్చింది. బదిలీ మీద వచ్చిందని ఆమెను పక్కన పెట్టడం లేదు. దానికి మరో కారణం ఉంది. అసలు ఆమెను బదిలీ చేసిందే ఆమె మీద కక్ష సాధింపు చర్యగా. ఆమె 2014 నుండి వాట్ఫోర్డ్ శాఖలో పనిచేస్తోంది. అక్కడ ఈమెపై లైంగిక వివక్ష.. వేధింపులు జరిగేవి.

ఒక సిబ్బంది తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె 2018లో ఫిర్యాదు చేసింది. దాంతో ఆమెను బదిలీ చేశారు. అక్కడ కూడా ఆమెను వేధింపులకు గురిచేశారు. అదేవిధంగా ఆమెకు జీతం కూడా పెరగకుండా చేశారు. ఇన్ని జరుగుతున్నా ఆమె ఓపిక పట్టింది. ఇక చివరికి ఒకసారి ఇలా పార్టీకి అన్నీ ఆర్డర్ చేసి తెప్పించి ఇచ్చాకా ఆమెను పక్కన పెట్టడంతో ఒక్కసారిగా ఆమెకు కోపం వచ్చింది. అంతే, ఆమె గట్టిగా అడిగింది. దీంతో ఆమెను ఉద్యోగం లోంచి తీసేశారు.

ఇక ఆమె ట్రిబ్యునల్ ను తనకు న్యాయం చేయమని ఆశ్రయించింది. ట్రిబ్యునల్ విచారణలో ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేలింది. దీంతో ఆమె పనిచేసిన కంపెనీ 23 వేల పౌండ్లను లేవికాకు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ కేసు విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ముందు, ఆమె పార్ట్ టైమ్ పనిచేస్తుందని కంపెనీ వాదించడానికి ప్రయత్నించింది, కాని వారు ఈ కారణాన్ని అంగీకరించలేదు. అంతే కాదు ట్రిబ్యునల్ లెవికా స్పష్టమైన ఆధారాలు ఇచ్చిందని చెప్పింది. ఆమెను కావాలనే వేధించారని చెప్పింది. మొత్తమ్మీద ఒక పిజ్జా పార్టీ (Pizza Party)లో జరిగిన అవమానంతో ఆమెకు 24 లక్షల రూపాయలు దొరికాయి.

Also Read: Imrankhan Statement: సొంతింట్లో దిక్కు లేదు కానీ కశ్మీర్‌ కావాలట.. ఆర్టికల్ 370ని రీవోక్ చేస్తేనే భారత్ చర్చలన్న ఇమ్రాన్

China census: చైనాలో తగ్గుతున్న జనాభా వృద్ధిరేటు..వన్ చైల్డ్ పాలసీ రద్దు చేసినా..వృద్ధిరేటు తగ్గటంపై బీజింగ్ ఆందోళన!