తల్లి కాబోతున్నానని మురిసిపోయింది. తొమ్మిది నెలలు మోసి.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆ ఆనందం ఆమెతో ఎంతో కాలం నిలవలేదు. శిశువు ప్రవర్తనలో రోజు రోజుకు వస్తున్న తేడాలు ఆమెను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. విషయం ఏంటని డాక్టర్లను ఆరా తీస్తే ప్రాబ్లమ్ ఏమీ లేదని చెప్పారు. అయినా బాబు ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మరోసారి ఆమె డాక్టర్ల వద్దకు వెళ్లింది. మరోసారి చిన్నారిని చెక్ చేయాలని కోరింది. దీంతో బాబును పరీక్షించిన వైద్యులు.. షాకింగ్ విషయాన్ని గుర్తించారు. యూకేలోని యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన హన్నా డోయల్ అనే మహిళ.. తన భర్తతో కలసి నివాసముంటోంది. మూడు నెలల క్రితం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి జాండర్ అనే పేరు పెట్టుకున్నారు. అయితే.. జాండర్ పుట్టినప్పుడే కాస్త డిఫరెంట్ గా కనిపించాడు. ఈ విషయాన్ని హన్నా సీరియస్ గా తీసుకోలేదు.
బాబు పుట్టినప్పుడు మెడ వెనుక భాగంలో గడ్డ కనిపించింది. ఆందోళన చెందిన హన్నా వైద్యులకు విషయాన్ని చెప్పింది. శిశువును పరీక్షించిన వైద్యులు.. ఆ గడ్డ వల్ల బాబుకు ప్రమాదమేమి లేదని చెప్పి, ఇంటికి పంపించారు. అయితే ప్రతిరోజూ హన్నా బాబులో మార్పులు గమనించి ఏదో తేడాగా ఉందనుకుని మరోసారి వైద్యుల దగ్గరకు వెళ్ళింది. బాబు నా పోలికలతోనూ, నా భర్త పోలికలతోనూ లేకుండా ఎలా ఉన్నాడు. కనీసం ఏదో ఒక పోలిక అయినా బాబులో కనిపించాలి కదా.. అసలు సమస్య ఏమిటో చెప్పాలని వైద్యులను కోరింది. దీంతో చేసేదేమీ లేక వైద్యులు.. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే.. పరీక్షా ఫలితాల్లో షాకింగ్ నిజం బయటపడింది. బాబుకు చాలా అరుదైన వ్యాధి ఉన్నట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది. అరుదైన క్రోమోజోమ్ ఉందట, దీనికారణంగా బాబుకు డిలీషన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చిందని తెలిసి డాక్టర్లు అవాక్కయ్యారు. కాగా అప్పటికే మూడు నెలల జాండర్ కు గుండె సంబంధ సమస్య కూడా ఉంది. బాబుకు గుండెలో రంధ్రం ఉందని హన్నా వెల్లడించింది. అయితే బాబుకు అరుదైన వ్యాధి ఉన్నట్టు బయటపడినా బాబులో స్పందనలు మాత్రం సాధారణంగానే ఉండటం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..