కాబూల్ విమానాశ్రయంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. విమానాలు ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించడంతో రద్దీని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందారని తెలుస్తోంది. దేశం తాలిబన్ల వశమైనందున విదేశాలకు అనేకమంది పారిపోతున్నారు. అయితే గుంపులను చెదర గొట్టేందుకు అమెరికా సైనికులు మొదట గాలిలోకి కాల్పులు జరిపారని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ ఘటనలో 5 గురు మృతి చెందినట్టు తాజాగా తెలుస్తోంది.
కానీ వీరు కాల్పుల్లో మరణించారా లేక తొక్కిసలాటలోనా అన్నది తెలియడంలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు అమెరికా దళాల కాల్పుల్లో ముగ్గురు ఆఫ్ఘన్లు మరణించారని కూడా అంటున్నారు. ఏమైనా ఈ విమానాశ్రయంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Firing at the Kabul airport. Taliban are barely 100 meters away and stopping people from entering the airport. Hundreds of people are sitting at the runway refusing to leave in the hope of flying out of the hell. (Video+Info) via local sources pic.twitter.com/iPt5N6ilx3
— Sudhir Chaudhary (@sudhirchaudhary) August 16, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత
హిందూ స్త్రీలు ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టే కుంకుమ బొట్టు ప్రాముఖ్యత ఏమిటంటే..