Vandalisation Hindu Temple: పాకిస్తాన్‌లో హిందూ దేవాలయం కూల్చివేత.. మరో 45 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..

|

Jan 03, 2021 | 9:23 PM

Vandalisation Hindu Temple: కైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కరక్ జిల్లా టెరీ గ్రామంలో ఏళ్ల నాటి హిందూదేవాలయాన్ని కూల్చివేసిన ఘటనలో మరో...

Vandalisation Hindu Temple: పాకిస్తాన్‌లో హిందూ దేవాలయం కూల్చివేత.. మరో 45 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Follow us on

Vandalisation Hindu Temple: కైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కరక్ జిల్లా టెరీ గ్రామంలో ఏళ్ల నాటి హిందూదేవాలయాన్ని కూల్చివేసిన ఘటనలో మరో 45 మందిని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టు ముందు హాజరుపరుచగా.. న్యాయస్థానం వారిని మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కాగా, ఆలయం కూల్చివేత ఘటనలో ఇప్పటి వరకు 100 మంది అనుమానితులను పాకిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ర్యాడికల్ ఇస్లామిస్ట్‌కు గ్రూపునకు చెందిన కొందరు వ్యక్తులు మూకగా వచ్చి పఖ్తుంఖ్వా ప్రాంతంలోని టెర్రీ గ్రామంలో ఏళ్లనాటి హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో అక్కడి అధికారులు దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 350 మంది పేర్లను ఈ ఘటనలో బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 100 మందిని అదుపులోకి తీసుకోగా మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇదిలాఉండగా ఆలయం కూల్చివేసిన చోటనే కొత్త ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. కొత్త ఆలయం నిర్మించేందుకు చర్యలు చేపడతామని కైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ మహమూద్ ఖాన్ ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక కమిటీని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

Also read:

ఏపీలో దేవాలయాలపై దాడులు పతాకస్థాయికి చేరాయి. అందుకే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా కోరుతున్నాం: సోము వీర్రాజు

భారత ప్రభుత్వ నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం, ఆగ్నేసియాలో కోవిడ్ పై పోరును బలోపేతం చేస్తుందని వ్యాఖ్య