క్రూరమైన ఉగ్రదాడి.. 2008 ముంబయి పేలుళ్లపై చైనా వ్యాఖ్యలు

| Edited By:

Mar 19, 2019 | 12:05 PM

2008లో భారత్‌లోని ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి కిరాతక ఉగ్రదాడుల్లో ఒకటని చైనా తెలిపింది. ఉగ్రవాదుల ఏరివేతపై శ్వేతపత్రం విడుదల చేసిన చైనా.. కొన్నేళ్లుగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్న అతివాదం, తీవ్రవాదం మానవాళిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని తెలిపింది. శాంతి పరిరక్షణ, అభివృద్ధికి ఉగ్రవాదం ముప్పుగా మారుతోందని, దీని వల్ల మనుషుల జీవితాలకు పెను ప్రమాదం వాటిల్లుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే పుల్వామా ఘటన తరువాత జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను […]

క్రూరమైన ఉగ్రదాడి.. 2008 ముంబయి పేలుళ్లపై చైనా వ్యాఖ్యలు
Follow us on

2008లో భారత్‌లోని ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి కిరాతక ఉగ్రదాడుల్లో ఒకటని చైనా తెలిపింది. ఉగ్రవాదుల ఏరివేతపై శ్వేతపత్రం విడుదల చేసిన చైనా.. కొన్నేళ్లుగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్న అతివాదం, తీవ్రవాదం మానవాళిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని తెలిపింది. శాంతి పరిరక్షణ, అభివృద్ధికి ఉగ్రవాదం ముప్పుగా మారుతోందని, దీని వల్ల మనుషుల జీవితాలకు పెను ప్రమాదం వాటిల్లుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే పుల్వామా ఘటన తరువాత జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లో 14 మద్దతు పలకగా.. చైనా మాత్రం అడ్డుపడింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఉగ్రవాదంపై చైనా శ్వేతపత్రం విడుదల చేయడం గమనర్హం.