Bomb Blast: రాజకీయ పార్టీ ర్యాలీలో బాంబు పేలుడు.. 30 మంది మృతి.. అట్టుడికిన పాకిస్తాన్‌..

|

Jul 30, 2023 | 7:05 PM

Pakistan Bomb Blast: పాకిస్తాన్‌ను మరోసారి భారీ పేలుడు జరిగింది. ఖైబర్‌ ఫక్తుఖావా ప్రాంతంలో జరిగిన పేలుడులో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పేలుడులో తీవ్రగాయాలయ్యాయి. జేయూ ఎఫ్‌ సంస్థ ర్యాలీలో ఈ పేలుడు జరిగింది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. సున్నీ వర్గం తీసిన ర్యాలీని టార్గెట్‌ చేస్తూ పేలుడు జరిగింది. బజౌర్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

Bomb Blast: రాజకీయ పార్టీ ర్యాలీలో బాంబు పేలుడు.. 30 మంది మృతి.. అట్టుడికిన పాకిస్తాన్‌..
Blast
Follow us on

బాంబు పేలుడుతో పాకిస్తాన్ వణికిపోయింది. సంమ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ ప్రాంతంలో జమియత్-ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (జెయూఏ-ఎఫ్) సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఆ పేలుడులో 30 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. జెయూఏ-ఎఫ్ కార్యకర్తల సదస్సు లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. దుబాయ్ మోర్ సమీపంలో పేలుడు సంభవించింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతమంతా క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తున్నారు. పేలుడు చాలా తీవ్రస్థాయలో ఉందని.. దాని శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని చెబుతున్నారు. పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై చెప్పలేమని డీఐజీ మలాకంద్ చెబుతున్నారు. సమాచారం సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, బజౌర్‌లోని జేయూఏ-ఎఫ్ కన్వెన్షన్‌లో జరిగిన పేలుడు దాటికి స్థానిక ప్రజలు వణికిపోయారు. ప్రజల భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు మాజీ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. తాను కూడా ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉందని.. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేదని జేయూఐ-ఎఫ్ నాయకుడు హఫీజ్ హమ్దుల్లా తెలిపారు.

ఇవి కూడా చదవండి

బాంబు పేలుడుపై జేయూఏ-ఎఫ్..

జేయూఏ-ఎఫ్ నేత మాట్లాడుతూ.. ‘తనకు అందిన సమాచారం ప్రకారం, 12 మంది తమ కార్యకర్తలు  మరణించారు. డజనుకు పైగా గాయపడినట్లు చెప్పారు. తాను పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది జిహాద్ కాదు ఉగ్రవాదం అని దాని వెనుక ఉన్న ప్రజలకు సందేశం పంపాలనుకుంటున్నాను. నేటి ఘటన మానవత్వంపై, సమాజం పై జరిగిన దాడి అని అన్నారు. పేలుడు ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జెయుఐ-ఎఫ్‌ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదని ఆయన గుర్తు చేశారు. ఇది ఇంతకు ముందు కూడా జరిగిందని.. మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రశ్నించినా.. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం