ఆఫ్ఘన్‌లో ఉపాధ్యక్ష అభ్యర్థి లక్ష్యంగా బాంబు దాడి.. ఇద్దరు మృతి

| Edited By:

Jul 29, 2019 | 8:02 AM

ఆఫ్ఘనిస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఉపాధ్యక్షుడిగా పోటీ చేయబోతున్న అమ్రుల్లా సలే లక్ష్యంగా బాంబుదాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మృతి చెందగా.. మరో 25మంది గాయపడ్డారు. కాబూల్‌లోని గ్రీన్ ట్రెండ్ కార్యాలయం సమీపంలో మొదటి బాంబు దాడి చేసిన దుండగులు.. ఆ తరువాత కార్యాలయంలోకి చొరబడ్డారు. తుపాకులతో రెండు గంటల పాటు కాల్పులు జరిపారు. ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజే ఈ హింసాత్మక దాడి జరిగింది. అయితే ఈ దాడిలో […]

ఆఫ్ఘన్‌లో ఉపాధ్యక్ష అభ్యర్థి లక్ష్యంగా బాంబు దాడి.. ఇద్దరు మృతి
Follow us on

ఆఫ్ఘనిస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఉపాధ్యక్షుడిగా పోటీ చేయబోతున్న అమ్రుల్లా సలే లక్ష్యంగా బాంబుదాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మృతి చెందగా.. మరో 25మంది గాయపడ్డారు. కాబూల్‌లోని గ్రీన్ ట్రెండ్ కార్యాలయం సమీపంలో మొదటి బాంబు దాడి చేసిన దుండగులు.. ఆ తరువాత కార్యాలయంలోకి చొరబడ్డారు. తుపాకులతో రెండు గంటల పాటు కాల్పులు జరిపారు. ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజే ఈ హింసాత్మక దాడి జరిగింది. అయితే ఈ దాడిలో సలేకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. కాగా ఈ దాడికి తామే బాధ్యులమని ఇంకా ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.