భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..! ఆ భయానక దృశ్యాలు

|

Sep 30, 2024 | 12:24 PM

భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందచేస్తున్నారు.

భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..! ఆ భయానక దృశ్యాలు
Nepal Heavy Rains
Follow us on

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 170 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 42 మంది గల్లంతయినట్టుగా సమాచారం. అనేక మంది గాయపడగా, మరికొందరు నీట మునిగి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పాందుతున్నారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. కాట్మాండుకు సమీపంలోని భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు.

ఈ వీడియో చూడండి..

తూర్పు మధ్య నేపాల్ లోని అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటిమట్ట మయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగానే ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ సిబ్బంది అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందచేస్తున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో మరెంత మంది వరదల్లో చిక్కుకుపోతారోనని ఆందోళన వ్యక్తమవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..