భారత్-అమెరికా దేశాలకు టార్గెట్ టర్కీ.. ఎందుకు ?

భారత-అమెరికా దేశాలకు టర్కీ టార్గెట్ గా మారింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇదో వింత మార్పు.తాజా పరిస్థితులను అవలోకిస్తే.. . సిరియాలోని లక్షలాది శరణార్థులను తమ దేశంలోకి తరలించేందుకు సిరియా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మండిపడుతుండగా.. సిరియాపై టర్కీ ఆధిపత్యాన్ని సహించలేని అమెరికా అధినేత ట్రంప్.. కారాలు, మిరియాలు నూరుతున్నారు. టర్కీ వెంటనే కాల్పుల విరమణను పాటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు తప్పవని ఆయన […]

భారత్-అమెరికా దేశాలకు టార్గెట్ టర్కీ.. ఎందుకు ?
Follow us

|

Updated on: Oct 15, 2019 | 5:07 PM

భారత-అమెరికా దేశాలకు టర్కీ టార్గెట్ గా మారింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇదో వింత మార్పు.తాజా పరిస్థితులను అవలోకిస్తే.. . సిరియాలోని లక్షలాది శరణార్థులను తమ దేశంలోకి తరలించేందుకు సిరియా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మండిపడుతుండగా.. సిరియాపై టర్కీ ఆధిపత్యాన్ని సహించలేని అమెరికా అధినేత ట్రంప్.. కారాలు, మిరియాలు నూరుతున్నారు. టర్కీ వెంటనే కాల్పుల విరమణను పాటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు తప్పవని ఆయన హెచ్ఛరిస్తున్నారు.ఇప్పటికే తమ దేశానికి సంబంధించి 50 అణుబాంబులను టర్కీ ‘ స్వాధీనం ‘ చేసుకోవడంపై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నార్తర్న్ సిరియా ఆక్రమణకు తక్షణమే స్వస్తి చెప్పాలని, ఆ ప్రాంతం నుంచి టర్కీ దళాలు వెనక్కి మళ్ళాలని ఆయన సూచిస్తున్నారు. అయితే టర్కీ ఇందుకు సుముఖంగా లేదు. మా లక్ష్యం నెరవేరవరకూ దాడి ఆగదని ఎర్డోగాన్ ప్రకటించాడు. సిరియా శరణార్థులు వెంటనే తమ దేశానికి తరలివెళ్లాలన్నది ఆయన డిమాండ్. ఇలా ఉండగా.. ఇండియా కూడా టర్కీ పట్ల ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ కు ఆ దేశం మద్దతునిస్తున్న నేపథ్యంలో ఇది ఇండియాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కాశ్మీర్ విషయంలో తమతో తీవ్రంగా విభేధిస్తున్న పాక్ కు అనుకూలంగా టర్కీ వ్యవహరించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ కారణంగానే ప్రధాని మోదీ ఇటీవల ఐరాస సమావేశాలకు హాజరయినప్పుడు.. టర్కీ శత్రు దేశాలైన సైప్రస్, ఆర్మీనియా, గ్రీస్ దేశాల అధినేతలతో భేటీ అయి.. పాక్ వైఖరిని వారి దృష్టికి తెచ్చారు.